కిరణ్ కుమార్ రెడ్డి పైనే భారమంతా ?

సౌత్ రాష్ట్రాలలో బలపడాలని బీజేపీ( BJP ) ఎన్నో ఏళ్లుగా గట్టి ప్రయత్నలే చేస్తోంది.ముఖ్యంగా ఏపీలో సత్తా చాటాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు.

 All The Burden Is On Kiran Kumar Reddy , Kiran Kumar Reddy , Ap Politics,bjp,pa-TeluguStop.com

ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తూ ప్రజల దృష్టిని తమ పార్టీపై పడేలా చూసుకుంటున్నారు కమలనాథులు.అయిన ఆశించిన స్థాయిలో ఆధరణ లభించడం లేదు.

ఇక జనసేనతో పొత్తు పొట్టుకోవడానికి కూడా ప్రధాన కారణం.పవన్ ( Pawan )అండతోనైనా ఏపీలో బలపడాలనే ఉద్దేశ్యమే.

అయితే పవన్ పొత్తులో ఉంటూనే బీజేపీకు దూరంగా వ్యవహరిస్తున్నారు.దీంతో ఎన్నివిధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఏపీ బీజేపీకి మాత్రం అనుకున్న స్థాయిలో మైలేజ్ రావడం లేదు.

దాంతో ఇతర పార్టీలపై ఆధారపడడం కంటే సొంత పార్టీనే బలపరచడంపై దృష్టి పెట్టింది కాషాయ పార్టీ.అందుకే బలమైన నాయకులను లాక్కునే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది.

గతంలో కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ ( Nallari Kiran Kumar )ను పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Telugu Ap, Janasena, Nallarikiran, Somu Viraraju-Latest News - Telugu

తాజాగా ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.కిరణ్ కుమార్ రాకతో ఏపీ బీజేపీ బలపడడం ఖాయం అనే భావనతో ఉంది కాషాయ దళం.కాగా కిరణ్ కుమార్ కు పార్టీలో ఎలాంటి పదవి కట్టబెట్టబోతుంది అనేదే ఇప్పుడు ఆసక్తికంగా మారింది.కొన్నాళ్ల నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు( Somu Viraraju ) పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డికి ఎన్నికల ముందు అధ్యక్ష పదవి కట్టబెట్టిన ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం.ఒకవేళ ఆయన అధ్యక్ష పదవి చేపడితే పార్టీలోని సీనియర్ నేతల నుంచి వ్యతిరేకత ఏర్పడే అవకాశం లేకపోలేదు.

కాబట్టి అధ్యక్ష పదవి విషయంలో డెసిషన్ తీసుకోవడం అధిష్టానానికి సవాలే.అయితే ఎన్నికలకు ఎంతో సమయం లేనందున క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

Telugu Ap, Janasena, Nallarikiran, Somu Viraraju-Latest News - Telugu

అధ్యక్షుడు సోము వీర్రాజు పాదయాత్ర చేపడుతున్నప్పటికి.ఆయన పాదయాత్ర పెద్దగా ఫోకస్ అవ్వడం లేదు.మరోవైపు జనసేన ( Janasena )పొత్తులో ఉంటుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి.ఈ నేపథ్యంలో పార్టీని బలపరిచే బాద్యత కిరణ్ కుమార్ రెడ్డిపైనే అధికంగా ఉండే అవకాశం ఉంది.

అయితే కిరణ్ కుమార్ రెడ్డి 2014 కంటే ముందు మాదిరి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారా లేదా ఈ మద్య కాంగ్రెస్ లో వ్యవహరించినట్లు.అంటి అంటనట్టుగా వ్యవహరిస్తారా ? అనేది కూడా ప్రశ్నార్థకమే.అయితే కాషాయ కండువా కప్పుకోగానే కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కిరణ్ కుమార్ రెడ్డి అదే రీతిలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపైనా.అంతే స్థాయిలో విమర్శలు గుప్పిస్తారా లేదా ? అనేది చూడాలి.మొత్తానికి కమలం పార్టీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డికి.ఆ పార్టీలో చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి.మరి వాటన్నిటిని కిరణ్ కుమార్ రెడ్డి ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube