వాడివేడి ప్రచారాలకు ముగింపు పలికేశారు.గ్రేటర్ లో కీలక ఘట్టమైన ఓటింగ్ ప్రక్రియ మొదలై పోయింది.
ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో జనాలు ఓట్లు వేసేందుకు క్యూలైన్లలో కనిపిస్తున్నారు.అయితే ఇప్పటికే అనేక సర్వేలలో గ్రేటర్ ఓటరు ఎవరివైపు ఉన్నారు అనే విషయం స్పష్టంగా తేలకపోవడంతో, అందరూ ఉత్కంఠగా ఎదురు చూపులు చూస్తున్నారు.
ఫలితాలు వెలువడేందుకు మరో నాలుగు రోజులు సమయం ఉండడంతో అందరిలోనూ ఒకటే టెన్షన్ కనిపిస్తోంది.గ్రేటర్ వీరులు ఎవరు అనేది తేలిపోతే ఆ తరువాత ఎన్నికల్లోనూ విజయం ఎవరి వైపు ఉంటుందనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుండడంతో, అప్పటివరకు అభ్యర్థులకు , రాజకీయ పార్టీలకు ప్రజలకు టెన్షన్ తప్పదు.
ఇది ఇలా ఉంటే, ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన మొదటి రెండు గంటల్లో జనాలు పెద్దగా కనిపించకపోవడంతో ఓటింగ్ శాతం గతంతో పోలిస్తే పెరుగుతుందా లేక తగ్గుతుందా అనే టెన్షన్ నెలకొంది.ప్రస్తుతం బిజెపి, టిఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.
అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి.ఇక ఈ ఎన్నికల్లో ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయం పైన పెద్ద ఎత్తున బెట్టింగ్ లు సైతం సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే యువత ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది లైన్లలో వారి హడావుడి పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా పాతబస్తీ వంటి ప్రాంతాలలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది.
దీంతో అన్ని పార్టీలు టెన్షన్ పడుతున్నాయి.

ఇప్పటికే సినీ హీరోలు చాలా మంది ఓటింగ్ ఆవశ్యకత ఏమిటి అనేది స్పష్టంగా చెబుతూ సందేశాలు ఇస్తున్నారు.ప్రతి ఒక్కరూ ఓటింగ్ ప్రక్రియ లో పాల్గొనాలని , ఓటు యొక్క విలువ ఏమిటనేది వీడియో సందేశం ద్వారా మోటివేట్ చేసేందుకు ప్రయత్నించారు.ఆ ప్రభావం కనిపిస్తుందో లేదో సాయంత్రానికి కానీ తెలిసేలా లేదు.
ఇది ఇలా ఉంటే గత గ్రేటర్ లో ఓటింగ్ శాతం గతంలో 46 శాతానికి మించలేదు.ఇప్పుడు ఓటింగ్ శాతం పెరుగుతుందా ? తగ్గుతుందా అనేది కూడా స్పష్టత లేదు.దీంతో రకరకాల అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో నెలకొంది.ఇప్పటికే సెలబ్రిటీలు అంతా, తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజలను ఓటింగ్ ప్రక్రియ పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తూ, సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడుతున్నారు.
ప్రస్తుతం గ్రేటర్ లో ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పెరిగితే, అది బీజేపీకి కలిసివస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఓటింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందనేది ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది.