అందరూ ఆహ్వానితులే.. హైదరాబాదులో జూన్ 14న యూఏఈ కాన్సులేట్ ప్రారంభోత్సవం షురూ!

హైదరాబాద్‌లో ( Hyderabad )కొలువుదీరిన యూఏఈ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం( UAE Consulate ) ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాలకు సేవలు అందిస్తుంది.ఇక్కడ ఉండే అరబ్‌ దేశాల పౌరులకు వివిధ సేవలు అందించడంతో పాటు.

 All Are Invited.. Inauguration Ceremony Of Uae Consulate In Hyderabad On June 14-TeluguStop.com

ఆ దేశానికి వెళ్లే వాళ్లకు కూడా ఇక్కడ వీసాలు జారీ చేయబడతాయి.ఇక దీనికోసం ఇక్కడ సిద్ధమవుతున్న హైదరాబాద్‌ యూఏఈ కాన్సులేట్‌ భవనం జూన్‌ 14వ తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నట్లు యూఏఈ కాన్సులేట్‌ జనరల్‌ ఆరేఫ్ అలీ అల్తాబూర్ అల్నుయిమి( Aaref Alnuaimi ) తాజాగా మీడియాతో తెలిపారు.

Telugu Aaref Alnuaimi, Andhra Pradesh, Ceremonyuae, Hyderabad, India, June, Tela

ఇకపోతే రోజు రోజుకు భారత్‌ నుంచి అరబ్‌ దేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.మరో వైపు యూఏఈ-భారత్‌ల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు కూడా బలోపేతం అవుతున్నాయి.ఈ కాన్సులేట్‌ కార్యాలయం వీటికి వారధిలాగా పనిచేయనుంది.ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని యూఏఈ పౌరుల భద్రతను నిర్ధారించేందుకు అవసరమైన డాక్యుమెంటరీ సహాయం అందించేందుకు, ఇతర సేవలను మెరుగుపరిచేందుకు ఇది సహకరిస్తుంది.

Telugu Aaref Alnuaimi, Andhra Pradesh, Ceremonyuae, Hyderabad, India, June, Tela

ఇది ఇరుదేశాలమధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసి, వాణిజ్యం పరంగా సహాయం చేయనుంది.4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కాన్సులేట్‌ భవనంలో అత్యాధునిక సదుపాయాలతో దాదాపు 200 మంది ప్రజలకు ఒకేసారి మాక్‌ వీసా ఇంటర్వ్యూలు నిర్వహించే విధమైన సౌకర్యాలు కలవు.రోజు, రోజుకు యూఏఈ కాన్సులేట్‌ అవసరాలు పెరుగుతుండడం, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కాన్సులేట్‌ భవనాన్ని నిర్మించినట్లు యూఏఈ కాన్సులేట్‌ జనరల్‌ అయినటువంటి ఆరేఫ్ అలీ అల్తాబూర్ అల్నుయిమి తెలిపారు.ప్రస్తుతానికి 16 మంది ఉద్యోగులతో ప్రారంభించనున్న కాన్సులేట్‌ అతి త్వరలో కార్యకలాపాలను విస్తరించేందుకు చూస్తున్నట్లు ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube