Vijayalakshmi :నిద్రలో కూడా అలాంటి సౌండ్స్ వినిపించేవి.. విజయలక్ష్మి కామెంట్స్ వైరల్?

తెలుగు వారికీ ఒకప్పటి సీనియర్ నటి ఎల్.విజయలక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Alitho Saradaga With Old Actress Vijayalakshmi Alitho Saradaga, Tollywood, Vijay-TeluguStop.com

ఈ తరం ప్రేక్షకులకు విజయలక్ష్మి గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ ఆ తరం ప్రేక్షకులకు విజయలక్ష్మి ఇట్టే గుర్తుపట్టేస్తారు.విజయలక్ష్మి అప్పట్లో ఆమె ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది.

అప్పట్లో ఆమెతో స్టార్ హీరోలు సైతం డాన్స్ చేయాలి అనుకునేవారు అంటే అప్పట్లో ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.అయితే విజయలక్ష్మి కెరీర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది.

తర్వాత ఆమె చాలా రేర్ గా మాత్రమే కనిపించింది.ఇది ఇలా ఉంటే తాజాగా విజయలక్ష్మి ఈటీవీలో ఆలీ నిర్వహించే ఆలీతో సరదాగా ప్రోగ్రాం కి వచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఆమె ఎన్నో విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.

ఈ మధ్య కాలంలో సినిమాలు చూశారా? అని అలీ ప్రశ్నించగా.ఆ విషయం పై స్పందించిన విజయలక్ష్మి.

లేదు.నాకు సినిమాలు చూసేంత టైం ఉండదు.

అప్పుడెప్పుడో బాలకృష్ణ సినిమాను చూశాను అంతే.ఆ తర్వాత చిరంజీవిది.

ఇటీవల అయితే పుష్ప సినిమా చూశాను.అప్పుడు ఆమె ఆ పుష్ప సినిమా హీరో ఎవరో కూడ తెలియదు అని చెప్పడంతో వెంటనే అలీ అల్లు రామలింగయ్య మనవడు అని చెబుతాడు.

వెంటనే ఆమె ఈరోజుల్లో ఎవరినీ అడిగినా ఈ హీరో ఫలనా వాళ్ల చుట్టాలనే అంటున్నారు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది.

Telugu Alitho Saradaga, Sounds, Tollywood, Vijayalakshmi-Movie

ఆ తరువాత అలీ మీకు పెళ్లి అయిన కొత్తల్లో నిద్రలో కూడా క్లాప్, యాక్షన్‌ అని వినపడుతుండేవట నిజమేనా? అని అడగగా.అవును నిజమే నేను ఇండియాలో ఉన్నన్ని రోజులు ఏదో ఒక షూటింగ్‌ ఉంటూనే ఉండేది.కానీ ఇక్కడి నుంచి అమెరికా కు వెళ్లిన తరువాత ఒక్కసారిగా అవి ఆగిపోయాయి.

నిద్ర పోతున్నప్పుడు కూడా సడెన్‌గా క్లాప్ సౌండ్‌ వినిపించేది.నిద్రలోనే రెడీ సర్‌ అనుకుంటూ లేచేదాన్ని అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది విజయలక్ష్మి.

అంతేకాకుండా ఆమె కెరియర్, ఫ్యామిలీ మ్యారేజ్ ఇలా ఎన్నో విషయాల గురించి ఆమె పంచుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube