ప్రెగ్నెంట్ అయిన ఆ సినిమాలో నటించడానికి అదే కారణం: అలియా భట్

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అలియా భట్( Alia Bhatt ) తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే.

ఈమె RRR సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇక్కడ కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

అయితే ఈ సినిమా తర్వాత ఈమె నటించిన బ్రహ్మాస్త్ర సినిమా కూడా తెలుగులో విడుదలై మంచి గుర్తింపు పొందింది.అయితే ఈమె గత ఏడాది నటుడు రణబీర్ కపూర్ ( Ranbir Kapoor )ను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

పెళ్లి తర్వాత వెంటనే పాప కూడా జన్మించడంతో ప్రస్తుతం ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.అయితే త్వరలోనే తిరిగి ఇండస్ట్రీలోకి రాబోతున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె నటించిన మొట్టమొదటి హాలీవుడ్ చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్స్( Heart Of! Stones ) నుంచి టీజర్ విడుదలైన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈ హాలీవుడ్ సినిమా( Hollywood Movie ) నుంచి టీజర్ విడుదల కావడంతో ఈ సినిమా గురించి అలియా భట్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.ఈ సందర్భంగా ఆలియా భట్ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఆయనప్పటికీ తాను వెనకడుగు వేయకుండా ఈ సినిమాని వదులుకోకుండా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నానని తెలిపారు.

Advertisement

ఇది తనకు వచ్చిన మొట్టమొదటి హాలీవుడ్ అవకాశం అయితే ఈ సినిమాలో కొన్ని యాక్షన్స్ సన్ని వేషాలు పూర్తి చేసిన తర్వాత తనకు ప్రెగ్నెన్సీ ( Pregnancy ) కన్ఫర్మ్ అయింది.అయితే ఆ సీన్స్ సరిగ్గా రాకపోవడంతో తిరిగి షూట్ చేయాలని భావించారు.అప్పటికి ప్రెగ్నెన్సీ అనే విషయం తెలియడంతో మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ యాక్షన్స్ సన్ని వేషాలను చిత్రీకరించారని తెలిపారు.

అయితే ఈ సినిమా తనకు మొదటి హాలీవుడ్ సినిమా కావడంతో ప్రెగ్నెన్సీ ఉన్న ఈ సినిమాని వదులుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమా షూటింగ్ పూర్తి చేశానని ఆలియా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు