సోమవారం (జనవరి 22) అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అట్టహాసంగా జరిగింది.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ మహా క్రతువుకు దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
అందులో అలియా భట్( Aliya Bhatt ) రణబీర్ కపూర్( Ranabir Kapoor ) కూడా హాజరైన సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరూ కూడా సాంప్రదాయ దుస్తులలో కనిపించారు.
ముఖ్యంగా ఆలియా భట్ కట్టుకున్నటువంటి చీర అందరి దృష్టిని ఆకర్షించింది.
ముంబై నుంచి అయోధ్యకు ప్రత్యేకమైనటువంటి విమానంలో బయలుదేరినటువంటి ఈ జంట అక్కడ అభిమానులతో కలిసి ఫోటోలు దిగారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉండగా ఆలియా కట్టుకున్నటువంటి చీర పై రామాయణం( Ramayanam )మొత్తం తెలియజేసేలా ఈ చీరను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు.
ముఖ్యంగా ఈమె చీర కొంగులో రామసేతు బ్రిడ్జి, హనుమాన్ చిత్రాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది అదేవిధంగా రామాయణాన్ని తన చీర కొంగు ద్వారానే ఈమె అందరికీ తెలియజేసేలా ఈ చీర ఉందని తెలుస్తుంది.
ఈ విధంగా ఆలియా భట్ ఫ్యాషన్‌లో తనకంటూ ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకున్న ఈమె ఇలా సందర్భానికి తగ్గట్టుగా ఎంతో సంప్రదాయంగా అయోధ్య వేడుకకు రావడం అందరినీ ఆకట్టుకుంది.ప్రస్తుతం అలియా భట్ రణబీర్ దంపతుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.వీరితో పాటు మరికొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.
అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి కూడా పలువురు సినీ సెలబ్రిటీలు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.