ఆర్ఆర్ఆర్‌లో అమ్మడికి స్పెషల్ ట్రీట్‌మెంట్.. ఎవరో తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఆమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.

ఈ సినిమాలో ఆలియా పాత్ర చాలా తక్కువ నిడివితో ఉంటుందని, దీంతో ఆమె కోసం రాజమౌళి ఓ స్పెషల్ సాంగ్‌ను తెరకెక్కి్స్తున్నట్లు తెలుస్తోంది.ఆలియా భట్ పాత్రను హైలైట్ చేసేందుకే జక్కన్న ఈ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి.

అటు తారక్‌కు జోడీగా ఒలివియా మారిస్‌కు మంచి పాత్ర ఉండటంతో ఆమెకు సరిసమానంగా ఆలియా భట్‌ను నిలబెట్టాలని రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడట.

Advertisement

తన సినిమాల్లో హీరోయిన్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వడంలో రాజమౌళి తనకు తానే సాటి అని మరోసారి ఆర్ఆర్ఆర్ ద్వారా నిరూపించుకుంటున్నాడని చిత్ర యూనిట్ తెలిపింది.ఇక బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో తాజాగా జాయిన్ అయ్యాడు.ఆయనకు జోడీగా శ్రియా సరన్ నటిస్తోంది.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు