బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో ఒకరిగా ఉన్నటువంటి నటి అలియా భట్ (Aliya Bhatt) కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్నారు.రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇకపోతే ప్రస్తుతం అలియా భట్ కూతురికి జన్మనివ్వడంతో సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు.త్వరలోనే ఈమె తిరిగి తన సినిమా షూటింగ్ పనులలో బిజీకానున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా అలియా భట్ ముంబైలో దాదాపు 37 కోట్ల రూపాయల విలువచేసే ఖరీదైన భవనం కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.ఇలా ఈ భవనాన్ని కొనుగోలు చేసిన ఆలియా భట్ త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ (Production House)ఏర్పాటుచేసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన ప్రొడక్షన్ హౌస్ పేరిట అలియా భట్ ఈ ఇంటిని కొనుగోలు చేశారు.ఇందుకు సంబంధించి స్టాంప్ డ్యూటీ కోసం ఈమె ఏకంగా 2.26 కోట్ల రూపాయలు చెల్లించారని తెలుస్తోంది.ఇలా ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసి త్వరలోనే ఈమె నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని, అందుకు సంబంధించిన కార్యకలాపాలని ఇక్కడే కొనసాగుతాయని తెలుస్తోంది.

ఇక అలియా భట్ ఇదివరకే ముంబైలో రెండు బంగ్లాలను కొనుగోలు చేశారు.ఒకటి తన చెల్లెలకు కానుకగా ఇచ్చారు.ఈ బంగ్లా విలువ దాదాపు 8 కోట్ల రూపాయలు చేస్తుందని సమాచారం.ఇక మరొక బంగ్లాలో ప్రస్తుతం తన భర్తతో కలిసి ఈమె నివసిస్తున్నారు.అయితే ఆలియా భట్ ప్రస్తుతం మరొక ఇంటి నిర్మాణ పనులలో కూడా బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఆలియా రణబీర్ ఈ ఇంట్లోనే ఉండబోతున్నారు.
ఇలా నటిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆలియా త్వరలోనే నిర్మాతగా కూడా మారబోతున్నారని తెలుస్తుంది.







