బ్యాంకులతో ప్రతిఒక్కరికీ అవసరం ఉంటుంది.బ్యాంకు లావాదేవీలు రోజు జరుగుతూ ఉంటాయి.
ప్రతిఒక్కరికీ రోజు డబ్బులు అవసరం ఉంటాయి.దీంతో బ్యాంకుల అవసరం ఉంటుంది.
ఇక వ్యాపారవేత్తలకు బ్యాంకులతో పని ఉంటుంది.దీంతో బ్యాంకులు ఏ రోజు పని చేస్తాయో.
ఏ రోజు పనిచేయవో తెలుసుకోవాల్సి అవసరం ఎంతో ఉంది.బ్యాంకులకు ఆదివారాలతో పాటు ప్రభుత్వం గుర్తించిన సెలవు రోజుల్లో మూత పడతాయి.
బ్యాంకు సెలవులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాలెండర్ విడుదల చేస్తోంది.ఇక వివిధ రాష్ట్రాల్లో అధికారిక పండుగలు ఉంటాయి.
దీంతో రాష్ట్రాల వారీగా సెలవును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది.
ప్రస్తుతం ఆగస్టు నెల ముగియబోతోంది.
మరో 6 రోజుల్లో ఆగస్టు నెల పూర్తి అయి సెప్టెంబర్ రాబోతోంది.దీంతో సెప్టెంబర్ లో ఏ రోజులు బ్యాంకులు పనిచేయవో ముందే తెలుసుకుంటే బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ముందుగానే మనం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది.సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు 8 రోజులు సెలవులు ఉన్నాయి.ఇవి కాకుండా శని, ఆదివారాలు కలిపి రోజులు సెలవులను కలిపితే మొత్తం 14 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి.
రాష్ట్రాలను బట్టి ఈ సెలవులు వేరు వేరుగా ఉన్నాయి.అవి ఏంటో చూద్దాం.

సెప్టెంబర్ 1న వినాయకచవితి రెండో రోజు, సెప్టెంబర్ 4 ఆదివారం, సెప్టెంబర్ 6న కర్మపూజ, సెప్టెంబర్ 7,8 ఓనం, సెప్టెంబర్ 9న ఇంద్రజాత, సెప్టెంబర్ 10న శ్రీ నరవణ గురు జయంతి, రెండో శనివారం, సెప్టెంబర్ 11న ఆదివారం, సెప్టెంబర్ 18న ఆదివారం, సెప్టెంబర్ 21న శ్రీ నారాయణ గురు సమాధి, సెప్టెంబర్ 24న నాలుగో శనివారం, సెప్టెంబర్ 25న ఆదివారం, సెప్టెంబర్ 26న ఆదివారం బ్యాంకులకు సెలవులు.