బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు బంద్..!

మీరు బ్యాంకు ఖాతాదారులా, అయితే ఈ న్యూస్ మీ కోసమే.ఈ నెల చివరిలో రెండు రోజులపాటు బ్యాంకులు బంద్ కానున్నాయి.

ఆల్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూనియన్ మెంబర్లు సమ్మెకు పిలుపునివ్వడమే ఇందుకు కారణం.బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వీరు దేశవ్యాప్తంగా మార్చి 28, 29 తేదీల్లో సమ్మెలో పాల్గొననున్నారు.

దీనివల్ల తమ బ్రాంచుల్లో సేవలకు అంతరాయం కలగొచ్చని ఆర్‌బీఎల్ బ్యాంక్ ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్ తాజాగా ప్రకటించింది.అయితే బ్యాంకుల్లో పనిచేసే వారే యూనియన్ మెంబర్లుగా ఉంటారు కాబట్టి వీరందరూ సమ్మెలో పాల్గొన్నప్పుడు బ్రాంచ్ బేస్డ్ బ్యాంకింగ్ సేవలపై ప్రతికూల ప్రభావం పడనుంది.

మార్చి నెలలో నాలుగో శనివారం అయిన మార్చి 26 సెలవు కాగా మార్చి 27 ఆదివారం అవుతోంది.దీంతో ఈ రెండు రోజులపాటు బ్యాంకులు పనిచేయవు.

Advertisement

అయితే ఆ రెండు రోజుల తర్వాత మరో రెండు రోజులపాటు యూనియన్ మెంబర్లు సమ్మెకు పిలుపునిచ్చారు.దీంతో మార్చి 28, 29 తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.

అలా వరుసగా నాలుగు రోజులపాటు మార్చి నెల చివరిలో బ్యాంకులు మూతపడుతున్నాయి.ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు ఖాతాదారులు తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి.

ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పగించడాన్ని నిరసిస్తూ రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చామని యూనియన్ మెంబర్లు చెబుతున్నారు.ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పని చేసేవారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.స్ట్రెస్ ఫుల్ వర్క్ వల్ల అధిక ఒత్తిడికి తాము గురవుతున్నామని, గతంలోలాగా వారంలో ఐదు రోజులు మాత్రమే పని ఉండేలా వర్కింగ్ డేస్ ఫిక్స్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అలాగే చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వాలని కోరుతున్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు