ఆలేరు ఎమ్మెల్యేకు హైకోర్టు జరిమానా...!

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకి హైకోర్టు షాకిచ్చింది.గత ఎన్నికల్లో తప్పుడు పత్రాలు ఇచ్చారనే ఆరోపణలపై హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయనందుకు ఆమెకు హైకోర్టు మంగళవారం రూ.10 వేల జరిమానా విధించింది.అక్టోబర్ 3 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆమెకు ఆదేశాలు జారీ చేసింది.

 Aler Mla Gongidi Sunitha Fined By High Court, Aler Mla Gongidi Sunitha, High Cou-TeluguStop.com

దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.

అయితే 2018 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులకు సంబంధించి సునీత తప్పుడు సమాచారం అందించారని, ఆస్తులను చూపలేదని సైని సతీష్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తప్పుడు సమాచారం అందించినందుకు ఆమె ఎన్నిక చెల్లదని,అనర్హత వేటు వేయాలని హైకోర్టును కోరారు.దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సునీతను ఆదేశించింది.

కానీ, ఇప్పటివరకు దాఖలు చేయకపోవడంతో హైకోర్టు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube