ఇది దొరల పాలన కాదు ప్రజల పాలనని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మేల్యే బీర్ల ఐలయ్య( Aler MLA Beerla Ilaiah ) అన్నారు.ప్రజా పాలనకు 100 రోజులు ప్రజా నాయకునికి 100 ప్రశ్నలు అనే కార్యక్రమం మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) కేంద్రంలోని దీప్తి హోటల్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం అనంతరం యాదాద్రి కొండపైన బస చేయడానికి వీలు లేకుండా ఉండేదని,కాంగ్రెస్ సర్కార్ వచ్చిన మూడు నెలల్లోనే కొండపైన బస చేసేలా పూర్వవైభవం తెచ్చామన్నారు.గత ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను పట్టించుకోపోలేదని,మూడు నెలల్లోనే ఇచ్చిన హామీ ప్రకారం ఆటో కార్మికులను కొండపైకి అనుమతిచ్చామన్నారు.
కొండపైన స్వామివారికి టెంకాయలు కొట్టే స్థలాన్ని తూర్పు రాజ గోపురం ఎదుట ఏర్పాటు చేశామని,ఆలయ అధికారులు అవినీతికి పాల్పపడితే కఠిన చర్యలతో పాటు బదిలీలు ఉంటాయని,ఆలయ అభివృద్ధికి సహకరించే ప్రతి దాతను గౌరవించే సాంప్రదాయం గుట్టకు ఉందని, అది కొనసాగుతుందని స్పష్టం చేశారు.
యాదగిరిగుట్ట పట్టణం( Yadagirigutta )లోని బ్రిడ్జిపై నిపుణులతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని,డ్రగ్స్, గంజాయి ఎవరు సరఫరా చేసినా,వినియోగించినా యాక్షన్ సీరియస్ గా ఉంటుందని హెచ్చరించారు.అతి త్వరలోనే ఆలేరు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బందు చేయిస్తామని తెలిపారు.100 రోజుల పాలనలో మూడు కోట్ల ఎల్ఓసిలు ఇచ్చామని, గంధముల రిజర్వాయర్ త్వరలోనే పూర్తి చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల అందేలా చూస్తామని,రాజపేట కోటను టూరిజంగా మారుస్తామని విలేకర్లు అడిగిన ప్రశ్నలకు గుక్క తిప్పుకోకుండా సమాధానాలు చెప్పారు.ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సంజీవరెడ్డి,కానుగు బాలరాజ్ గౌడ్,ఆలేరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.