అల్లావుద్దీన్ చాపపై దూసుకెళ్తున్న యువకుడు.. వీడియో వైరల్

మీకు టీవీ కార్టూన్లలోనూ, ఎన్నో కథల పుస్తకాల్లోనూ అల్లావుద్దీన్( Alauddin ) అద్భుత దీపం కథలు వినే ఉంటారు.ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది.

 Alauddin Is A Young Man Jumping On The Mat The Video Is Viral , Alauddin , T-TeluguStop.com

దీంతో దీనిపై హాలీవుడ్ సినిమా హీరోలతో సైతం సినిమాలు తీస్తున్నారు.ఈ అల్లావుద్దీన్ కథలను పిల్లలు ఎంతగానో ఇష్టపడుతుంటారు.

ఇవి టీవీలలోనూ వస్తుంటాయి.ఇలా టెలివిజన్ క్యారెక్టర్ అల్లాదీన్ మనందరికీ సుపరిచితమే.

అల్లాదీన్ మాయా తివాచీ గాలిలో ఎగురుతున్నట్లు మనందరం టీవీలో చాలాసార్లు చూశాం.అయితే గురుగ్రామ్‌లో అల్లాఉద్దీన్ వేషధారణలో ఓ వ్యక్తి సంచరించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అల్లావుద్దీన్‌లాగా దుస్తులు ధరించిన ఈ వ్యక్తికి కార్పెట్ కూడా ఉంది.అతను తన కార్పెట్ మీద నిలబడి గురుగ్రామ్ వీధుల్లో నడుస్తూ కనిపించాడు.

అతనిని చూసిన ప్రతి ఒక్కరూ థ్రిల్ అయ్యారు.ఈ ‘అల్లావుద్దీన్’ గురుగ్రామ్ వీధుల్లో దిగిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.

ఈ వీడియో పాతదే అయినప్పటికీ, ఇది మరోసారి మరలా వైరల్ అవుతోంది.

ఈ వీడియోను మరోసారి సోషల్ మీడియా( Social media ) మాధ్యమం రెడ్డిట్‌లో షేర్ చేశారు.ఈ వీడియో కూడా చాలా వైరల్‌గా మారింది.ఈ క్లిప్‌ను కంటెంట్ క్రియేటర్ కెవిన్ కౌల్ రూపొందించారు.

అతడిది హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతం.ఇక కెవిన్ కౌల్ తాను అల్లావుద్దీన్ లాగా దుస్తులు ధరించి ‘మ్యాజిక్ కార్పెట్’పై తిరుగుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

అతను తన కార్పెట్‌పై వీధుల్లో తిరుగుతున్నప్పుడు, అనేక ఇతర వాహనాలు కూడా రహదారిపై కదులుతున్నాయి.

కెవిన్ కౌల్‌ని చూసి ఈ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు.మధ్యలో ఒక చోట ఆగి అతడు ఐస్ క్రీమ్ తిన్నాడు.ఇతరులకు కరచాలనం అందించాడు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.టెక్నాలజీ( Technology ) సాయంతో అల్లావుద్దీన్ చాపకు చక్రాలు, సెన్సార్ పెట్టి రిమోట్‌ సాయంతో దానిపై ప్రయాణించడం సామాన్య విషయం కాదని ప్రశంసిస్తున్నారు.

అయితే మరికొందరు మాత్రం ఇలా రద్దీ రోడ్లపై విన్యాసాలు చేయొద్దని సూచిస్తున్నారు.ఎవరైనా మిమ్మల్ని ఢీకొట్టినా, ఇతరులను మీరు ఢీకొట్టినా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతాయని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube