సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో జయలక్ష్మి( Jayalakshmi ) ఒకరు కాగా ఈ నటి 150కు పైగా తెలుగు సినిమాలలో నటించారు.నేను యాంకర్ గా వచ్చానని 27 సంవత్సరాల వయస్సులో ఇండస్ట్రీకి రావడంతో మంచి అవకాశాలు వచ్చాయని ఆమె పేర్కొన్నారు.
పిలిస్తే పలుకుతా సినిమాలో( Pilisthe Palukutha )నేను నటించానని ఆమె వెల్లడించారు.ఆ సినిమా తర్వాత కెరిర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోలేదని జయలక్ష్మి అన్నారు.

ప్రతి నటికి తన టాలెంట్ కు తగ్గ గుర్తింపు రావాలని ఉంటుందని అందుకే సీరియల్స్ పై దృష్టి పెట్టానని ఆమె చెప్పుకొచ్చారు.సీరియల్స్ నాకు సరదా సరదాగా అనిపించిందని జయలక్ష్మి కామెంట్లు చేశారు.నా జీవితంలో జరిగిన ఒక ఘటన ఎంతో బాధ పెట్టిందని ఆమె చెప్పుకొచ్చారు.నేను షాట్ లోకి వెళ్లబోతున్న సమయంలో వేరే మంచి పాత్ర ఇస్తామని చెప్పి పంపించేశారని జయలక్ష్మి కామెంట్లు చేశారు.

ఆర్టిస్ట్ కు మేకప్ వేసిన తర్వాత తీసేశారని ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని జయలక్ష్మి అన్నారు.ఒక మంచి మనస్సు ఉన్న వ్యక్తిని బాధ పెట్టకూడదని ఆమె కామెంట్లు చేశారు.ఆ ఘటన జరిగిన సమయంలో మనస్సుకు చాలా బాధ కలిగిందని జయలక్ష్మి వెల్లడించారు.ఆ మూవీ పేరు చెప్పనని జయలక్ష్మి అన్నారు.ఆ సినిమా చాలా పెద్ద మూవీ అని జయలక్ష్మి కామెంట్లు చేయడం గమనార్హం.
సిన్సియర్ గా ఉండే వ్యక్తుల ఎమోషన్స్ తో ఆడుకోవద్దని జయలక్ష్మి( Jayalakshmi ) చెప్పుకొచ్చారు.
జయలక్ష్మి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.జయలక్ష్మి ఆ సినిమా పేరును రివీల్ చేసి ఉంటే బాగుండేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
జయలక్ష్మిని అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.







