Nadendla Manohar : తెనాలి సీటు ‘ నాదెండ్ల’ కే ! ఆలపాటి రూటు ఎటో ? 

టిడిపి, జనసేన మధ్య సేట్ల వ్యవహారం హాట్ టాపిక్ గానే మారింది.రెండు పార్టీల అధినేతల మధ్య ఈ విషయంలో సానుకూల వైఖరి ఉన్నా.

 Alapati Vs Nadendla Tenali Seat-TeluguStop.com

క్షేత్రస్థాయిలో మాత్రం వివాదాలకు కారణం అవుతున్నాయి.ముఖ్యంగా సీట్ల సర్దుబాటు వ్యవహారం రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది.

కొన్ని కీలక నియోజకవర్గల విషయంలో తలనొప్పులు తయారయ్యాయి.ఆయా నియోజకవర్గాలపై అటు టీడీపీ ఇటు జనసేన కు చెందిన కీలక నేతలు ఆశలు పెట్టుకున్నారు.

ఈ విషయంలో పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) సైతం పట్టుదలగానే ఉండడంతో,  టిడిపి టికెట్ ఆశిస్తున్న సీనియర్లు అసంతృప్తితో ఉంటూ పార్టీ మారే ఆలోచనకు వస్తున్నారు .ఇప్పటికే రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సీటు విషయమే టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి( TDP Senior Leader Gorantla Buchaiah Chowdary ) అసంతృప్తితో ఉండగా, తాజాగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం విషయంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది.ఇక్కడ జనసేన పార్టీలో కీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు.

Telugu Alapati Raja, Alapatinadendla, Galla Jayadev, Gunturtdp, Janasena, Pawan

నాదెండ్ల కే టికెట్ అని పవన్ సైతం ఈ విషయంలో క్లారిటీతోనే ఉన్నారు.అయితే ఇక్కడ టిడిపి సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలి( TDP Senior Leader Alapati Rajendra Prasad ) టికెట్ పైనే ఆశలు పెట్టుకున్నారు.దీంతో గత కొంతకాలంగా ఈ టికెట్ ఎవరికి దక్కుపోతుందనేది ఆసక్తికరంగా మారింది.

తెనాలి నుంచి తాను పోటీ చేస్తానని ఇప్పటికే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రకటించగా.తాజాగా ఈ వ్యవహారంపై అటు టిడిపి, జనసేనలు క్లారిటీ ఇచ్చేసాయి.

ఈ మేరకు నారా లోకేష్ తెనాలి సీటు నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) కే ఇవ్వబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది దీంతో ఆలపాటి రాజేంద్రప్రసాద్ రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.అయితే ఆయనకు గుంటూరు ఎంపీ టికెట్( Guntur MP Ticket ) ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు( Chandrababu ) ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

Telugu Alapati Raja, Alapatinadendla, Galla Jayadev, Gunturtdp, Janasena, Pawan

ఇక్కడ టిడిపి సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్( Galla Jayadev ) రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించడంతో, ఈ సీటు ఖాళీ అయింది.కమ్మ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడంతో, అదే సామాజిక వర్గానికి చెందిన వారికి టిక్కెట్ ఇవ్వాలనే ఆలోచనతో టిడిపి ఉంది.దీంతో ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.కానీ ఆలపాటి మాత్రం తెనాలి అసెంబ్లీ నుంచే తాను పోటీ చేయాలని డిసైడ్ అయిపోయారట.

అధికారికంగా తెనాలి సీటు( Tenali )ను నాదెండ్ల మనోహర్ కు కేటాయిస్తే.ఆలపాటి రాజా రాజకీయ అడుగులు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube