సౌత్ సినిమాల దెబ్బకు తేలైన బాలీవుడ్ పరిశ్రమ కరోనా కారణంగా మరింత దెబ్బతింది.తీసేవి నాశరకం సినిమాలు కావడంతో ఇక బాలీవుడ్ ను కాపాడే నాధుడే లేకపోయాడు.
వరుసగా సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్ కి సినిమాలు వెళ్లి హిట్టు కొడుతుండడం, బాలీవుడ్ లోనే వస్తున్న స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో చాలా రోజులుగా వారి గురించి మాట్లాడుకోవడం కూడా మానేశారు.సందులో సడేమియా అంటూ పఠాన్, దృశ్యం 2 కాస్త విజయం సాధించడంతో బాలీవుడ్ గట్టిక్కుతుందని బ్రమపడిన వారికి నోట్లో గులకరాయి పడ్డంత పనైపోయింది.
ఈ రెండు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి.మిగతా అన్ని సినిమాల పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది.

ఇక ఇప్పుడు అక్షయ కుమార్ నటించిన సెల్ఫీ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది.మరి లక్షల్లో కలెక్షన్స్ వస్తుండడంతో ప్రతి ఒక్కరు అక్షయ్ కుమార్ విషయంలో జాలి పడటం తప్ప ఏమీ చేయలేరు.గత 35 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీ తప్ప మరొక ప్రపంచం లేని అక్షయ్ కుమార్ రెండు నెలలకు ఒక సినిమా చొప్పున అలావోకగా తీసేస్తూ ఉంటాడు.చాలా ఎనర్జీ ఉన్న హీరో అయినప్పటికీ ఆయన సినిమాల కలెక్షన్స్ అంత ఎనర్జీ గా లేవు.
ఇక సెల్ఫీ సినిమా ఫ్లాప్ ఒకటే కాదు ఆయన నటించిన గత ఆరు సినిమాల పరిస్థితి ఇదే రకంగా ఉంది.సామ్రాట్ పృధ్విరాజ్, రామసేతు, బచ్చన్ పాండే, కట్ పుతిల్ వంటి ఐదు సినిమాల ఫ్లాప్స్ తర్వాత వచ్చిన సినిమా సెల్ఫీ.

మొదటినుంచి ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని నెగిటివ్ కామెంట్స్ వినబడుతూనే ఉన్నాయి.మలయాళం లో వచ్చిన ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమాకు రీమేక్ గా వచ్చింది సెల్ఫీ.మామూలుగా అయితే ఈ సినిమా నచ్చితే డబ్బింగ్ చేస్తే బాగానే ఉండేది కానీ అక్షయ్ కుమార్ లాంటి ఒక స్టార్ హీరో తో రీమేక్ చేయడంతో బడ్జెట్ చేయి దాటిపోయింది వస్తున్న కలెక్షన్స్ చూస్తే కనీసం రీల్ ఖర్చు కూడా వచ్చేలా లేదు.ఇలా బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వసూళ్లు ఉసూరుమంటుంటే మరోవైపు సౌత్ నుంచి వస్తున్న సినిమాల జోరు పెరిగిపోతోంది.