బిగ్ బాస్ వేదికపై 'నా సామిరంగ' టీజర్.. లాంచ్ చేయనున్న సూపర్ స్టార్!

అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) సీనియర్ హీరోల్లో ఒకరు.ఈ స్టార్ హీరో కొన్ని దశాబ్దాలుగా తెలుగు తెరపై హీరోగా రాణిస్తూ ప్రేక్షకుల చేత జేజేలు కొట్టించుకుంటున్నారు.

 Akkineni Nagarjuna's Naa Saami Ranga Teaser, Nagarjuna, Tollywood , Naa Saami Ra-TeluguStop.com

నాగ్ ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.అయితే గత కొన్నాళ్లుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాగార్జున ఈసారి మంచి మాస్ మసాలా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అది కూడా పొంగల్ రేసులో రాబోతుండడం విశేషం.గట్టి పోటీ మధ్యనే రావడానికి సిద్ధం అవ్వడంతో నాగార్జునకు ఈ సినిమాపై ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ గురించి ఇంట్రెస్టింగ్ టాక్ బయటకు వచ్చింది.మరో మూడు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే జరగబోతున్న విషయం తెలిసిందే.ఈ ఫినాలే ఎపిసోడ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా రాబోతున్నారు.దీంతో ఈ వేదికపైనే సూపర్ స్టార్ ( Mahesh Babu ) చేతుల మీదుగా నా సామిరంగ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు అనే టాక్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

కాగా విజయ్ బన్నీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.మలయాళ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ ( Ashika Ranganath ) హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇక నాగార్జున పొంగల్ రేసులో అందరి కంటే ముందుగానే జనవరి 10 లేదంటే 11న వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

చూడాలి మరి ముందు వస్తే నాగ్ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube