ఒకప్పుడు టాలీవుడ్ లో సినిమాలకు తెలుగు పేర్లను మాత్రమే టైటిల్స్ గా పెట్టేవారు.కానీ ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి.
ఇప్పుడు అంతా తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలా అన్ని భాషలను కలిపి టైటిల్స్ గా పెడుతున్నారు.ప్రేక్షకులు కూడా వాటికే అలవాటు పడుతున్నారు.
అందులోను ఇటీవల కాలంలో పాన్ ఇండియా వ్యాప్తంగా సినిమాలు రిలీజ్ చేయడంతో ఇలాంటి టైటిల్స్ అయితే అక్కడ కూడా రీచ్ అవుతాయి అని అలా యూనివర్సల్ టైటిల్స్ కే మొగ్గు చూపిస్తున్నారు.
అయితే మిగతా హీరోల సంగతి ఎలా ఉన్న అక్కినేని హీరోలు మాత్రం ఇంగ్లీష్ టైటిల్స్ నే పెడుతూ వరుస హిట్స్ సైతం అందుకుంటున్నారు.
తండ్రి నాగార్జున నుండి కొడుకులు నాగ చైతన్య, అఖిల్ వరకు ముగ్గురు కూడా ఇంగ్లీష్ టైటిల్స్ నే పెట్టుకుంటున్నారు.వాటికే మద్దతు తెలుపు తున్నారు.నాగార్జున ది గోస్ట్, నాగ చైతన్య థాంక్యూ, అఖిల్ ఏజెంట్ అంటూ ముగ్గురు కూడా ఇంగ్లీష్ టైటిల్స్ తోనే రాబోతున్నారు.
ప్రెసెంట్ నాగార్జున ది గోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకుంది.ఈ దసరాకు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.ఇక అక్కినేని నాగ చైతన్య విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో థాంక్యూ సినిమా చేయగా అది కూడా రిలీజ్ కాబోతుంది.ఈ నెల 22న ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఇప్పటికే వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన లభిస్తుంది.

ఇక అక్కినేని అఖిల్ కూడా ఏజెంట్ అంటూ ఇంగ్లీష్ టైటిల్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ సినిమాలు చేసిన అఖిల్ ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు.ఇది స్పై త్రిల్లర్ గా తెరకెక్కుతుంది.
మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.







