అక్కినేని ఫ్యామిలీ ఆశా కిరణం అన్నట్లుగా సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన అఖిల్( Akhil ) కి అదృష్టం కలిసి రావడం లేదు.మొదటి సినిమా నుండి మొన్న చేసిన ఏజెంట్ సినిమా( Agent Movie ) వరకు ఏ ఒక్క సినిమా కూడా ఆయన కు కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించలేక పోయాయి.
ఇతర ఫ్యామిలీల హీరోలు ఒక వైపు వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతూ స్టార్ హీరోలుగా దూసుకు పోతున్న ఈ సమయం లో అక్కినేని ఫ్యాన్స్ కి మాత్రం ఉసూరుమనిపించేలా అఖిల్ సినిమా కలెక్షన్స్ ఉంటున్నాయి.

నాగార్జున ( Nagarjuna )మరియు నాగచైతన్య సినిమా లు కూడా అంతంత మాత్రంగానే ఆడుతున్నాయి.ఈ సమయం లో అఖిల్ సినిమా లు కచ్చితం గా యంగ్ స్టార్ హీరోలకు పోటీ గా ఉంటాయని అక్కినేని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.కానీ వారి ఆశలన్నీ అడియాసలైయ్యాయి.
అయితే కొందరు ఫ్యాన్స్ ఇంకా కూడా తమ అభిమాన హీరో అఖిల్ ఫామ్ లోకి వస్తాడు, పుంజుకుంటాడు.అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ మరియు కుటుంబ సభ్యులు గర్వించే విధంగా వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టే సినిమాలు చేస్తాడు అంటూ ప్రతి ఒక్కరు కూడా ధీమా తో ఉన్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఏజెంట్ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టేది.కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది.అయినా కూడా అఖిల్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వెంటనే సినిమా చేయాలని భావించాడు.

కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం చేస్తూ వస్తున్నాడు.ఈ సమయం లో ఫ్యాన్స్ అఖిల్ సినిమా ఎంత ఆలస్యమైనా పర్వాలేదు.కానీ ఈ సారి మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఉండాలని కోరుకుంటున్నారు.ఫ్యాన్స్ కోరిక ఎంత వరకు వర్కౌట్ అయ్యిద్ది అనేది చూడాలి.ప్రస్తుతానికి అఖిల్ కొత్త సినిమా కోసం స్క్రిప్ట్ వింటున్నాడట.పలు స్టోరీ లైన్స్ కి ఓకే చెప్పిన అఖిల్ త్వరలోనే ఒక మంచి కథ ని ఎంపిక చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక చైతూ( Naga Chaitanya ) మరియు నాగార్జునలు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.వచ్చే ఏడాది లో అఖిల్ సినిమా రాకున్నా ఆ ఇద్దరి సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.







