అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి అఖిల్( Akhil ) ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఒక్క సినిమా ద్వారా కూడా సరైన హిట్ అందుకోలేదు.అఖిల్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకున్నారు.
ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్ కావడంతో అఖిల్ అదృష్టం ఏమాత్రం బాగాలేదని అందుకే ఈయన ఒక్క సినిమా కూడా హిట్ అందుకోలేక పోతున్నారని పలువురు వెల్లడించారు.అయితే అఖిల్ పరిస్థితి చూస్తుంటే మాత్రం ఈయనకు దరిద్రం తాండవ మాడుతుందని చెప్పాలి.
అఖిల్ చివరిగా సురేందర్ రెడ్డి( Surendar Reddy ) దర్శకత్వంలో నటించిన ఏజెంట్( Agent ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచిపోయింది.
ఈ సినిమా విడుదలయ్యి దాదాపు 6 నెలలకు పైగా అవుతుంది అయితే ఇప్పటివరకు ఈ సినిమా డిజిటల్ మీడియాలో మాత్రం ప్రసారం కాలేదు.సినిమా ఓటీటీలో ప్రసారం చేయాలని ఇదివరకే నిర్మాతలు భావించారు .అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.ఇలా దాదాపు కొన్ని నెలల తర్వాత తిరిగి మరోసారి ఈనెల 29న సోనీ లీవ్ లో విడుదల కావడానికి సిద్ధమైంది అయితే మరోసారి ఈ సినిమా వాయిదా పడిందని తెలుస్తోంది.

అనిల్ సుంకర( Anil Sunkara ) నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో కి చెందిన డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ(సతీష్) అనే వ్యక్తిని డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అనిల్ సుంకర ఘోరంగా మోసం చేశారంటూ గతంలో కూడా ఈ విషయంపై రచ్చ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో మరోసారి ఈయన ఇదే విషయం గురించి గొడవ చేస్తూ సిటి సివిల్ కోర్టుకు వెళ్లారు.ఇలా నిర్మాత అనిల్ సుంకర తనకు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో భారీగా మోసం చేశారని ఈయన ఆరోపణలు చేయటమే కాకుండా కోర్టుకు వెళ్లడంతో ఆయనకు అనుకూలంగా తీర్పురావడం గమనార్హం.

కోర్టులో సతీష్ తరపున న్యాయవాది వాదనలు విన్న అనంతరం ఈ సినిమా ఈనెల 29వ తేదీ సోనీ లీవ్ లో విడుదల కాకూడదు అంటూ తీర్పు ప్రకటించారు.దీంతో మరోసారి సినిమా విడుదల వాయిదా పడింది.ఇలా థియేటర్లో మెప్పించలేకపోయిన ఏజెంట్ సినిమా కనీసం ఓటీటీలో అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమోనని అక్కినేని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో వారికి మరోసారి నిరాశ ఎదురయింది.
దీంతో అభిమానులు సైతం ఈ సినిమా పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ మరో సినిమాకి కమిట్ అవ్వలేదని చెప్పాలి ఇప్పటివరకు ఈయన తదుపరి సినిమా గురించి ఎలాంటి ప్రకటన రాలేదు.







