టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ) ఒకరు.ప్రస్తుతం ఈయన గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకొని తన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర( Devara ) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ సినిమా ఏడాది వేసవి సెలవులకు విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఎన్టీఆర్ బామ్మర్ది లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్(Naarne Nithin) కూడా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.

కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నటువంటి చిత్రం మ్యాడ్( Mad ) .ఈ సినిమా అక్టోబర్ ఆరవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అనంతరం చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో భాగంగా ఒక మీడియా ప్రతినిధి నితిన్ ను ప్రశ్నిస్తూ ఎన్టీఆర్ నుంచి మీరు స్ఫూర్తిగా తీసుకున్న విషయాలు గురించి చెప్పమని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు నితిన్( Nithin ) సమాధానం చెబుతూ…బావనుంచి నేర్చుకోవడానికి ఏముంది.అన్ని ఉన్నాయి.నేర్చుకోవాలంటే ఆయన దగ్గరనుంచి ఒక పది నేర్చుకోవచ్చు.బావగారు దగ్గరనుంచి నేర్చుకోవాలి అంటే రోజుకు పది .ఒక సంవత్సరం మొత్తం ఉన్నా కూడా ఇంకా మిగిలే ఉంటాయి.ఆయన డ్యాన్స్, నటన రెండు ఇష్టమే అంటూ సమాధానం చెప్పారు.
అయితే ఈ ప్రశ్నకు ఈయన కన్ఫ్యూజన్ అయి మాట్లాడినారని స్పష్టంగా అర్థమవుతుంది.ఇక తన నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు అని చెబుతున్నారు కానీ ఏం నేర్చుకోవాలి అనే విషయాలను గురించి మాత్రం క్లారిటీగా చెప్పకపోవడంతో అసలు ఎన్టీఆర్ గురించి చెప్పడానికి ఇంతకన్నా ఏమీ లేదా మీ బావను ఇన్ని రోజులు నుంచి చూస్తున్న ఆయన గురించి చెప్పడానికి మాటలే లేవా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.







