పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ కోసం ఎమోషనల్ వీడియో చేసిన అకిరా నందన్..!

టాలీవుడ్( Tollywood ) లో ఒకప్పుడు మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంట పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్( Pawan Kalyan – Renu Desai ).బద్రి సినిమాతో ప్రారంభమైన వీళ్లిద్దరి పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారి కొన్నాళ్ళకు డేటింగ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు.

 Akira Nandan Made An Emotional Video For Pawan Kalyan - Renu Desai , Pawan Kalya-TeluguStop.com

దాదాపుగా 12 ఏళ్ళు కలిసి కాపురం చేసిన ఈ జంట మధ్య కొన్ని విబేధాలు ఏర్పడడం తో విడిపోవాల్సి వచ్చింది.వీళ్లిద్దరు విడిపోయిన తర్వాత అభిమానులు చాలా హర్ట్ అయ్యారు.

కలిసి ఉంటే చాలా బాగుండేది అని అనుకుంటూ ఉండేవారు.ఇప్పటికీ రేణు దేశాయ్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వదిన అనే పిలుస్తారు.

పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత కూడా రేణు దేశాయ్ ఆయన గురించి ఎన్నోసార్లు ఎంతో గొప్పగా మాట్లాడింది, ఆమె మాట్లాడే మాటల్లో పవన్ కళ్యాణ్ ని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ స్పష్టం గా కనిపించింది.

ఇది కాసేపు పక్కన పెడితే వీళ్లిద్దరి కొడుకు అకిరా నందన్( Akira Nandan ) కి తన తల్లి అంటే ఎంత ప్రేమో, తన తండ్రి అంటే కూడా అంతే ప్రేమ.ఇద్దరికీ సరిసమానమైన ప్రాముఖ్యత ని ఇస్తూ ఉంటాడు.సోషల్ మీడియా లో అకిరా నందన్ లేడు కానీ, ఆయనకీ సంబంధించిన వీడియోలు, ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది.

ఈరోజు రేణు దేశాయ్ పుట్టినరోజు కావడం తో అకిరా నందన్ ఒక మధురమైన జ్ఞాపకం ని బహుమతిగా ఇచ్చాడు.పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ కలిసి నటించిన జానీ చిత్రం లో కొన్ని షాట్స్ ని కట్ చేసి, మంచి ఎమోషనల్ సాంగ్ తో ఎడిట్ చేసి ఇచ్చాడు.

దీనికి రేణు దేశాయ్ ఎంతో సంతోషించి ఆ వీడియో ని ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది.దీనికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అకిరా నందన్ ఎడిట్ చేసిన ఆ వీడియో ని చూసి పవన్ ఫ్యాన్స్ ఎంతో మురిసిపోతున్నారు.ఈ కుర్రాడికి మ్యూజిక్ టాలెంట్ ఉంది, మార్షల్ ఆర్ట్స్ వచ్చి, కటౌట్ చూస్తే హాలీవుడ్ హీరో రేంజ్ లో ఉంది, ఇప్పుడు ఈ ఎడిటింగ్ చూసిన తర్వాత ఎడిటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి, ఇంత టాలెంట్ పెట్టుకొని ఇంకా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వకపోవడం ఏమిటి.?, తొందరగా ఎంట్రీ ఇప్పించండి బాబోయ్ అంటూ ఆ వీడియో క్రింద పోస్టులు పెడుతున్నారు.అయితే అభిమానులు ఎంత అడిగినా కూడా రేణు దేశాయ్ అకిరా కి సినిమాలు అంటే ఇష్టం లేదని చెప్తూనే ఉంది.

మరి ఆయన ఎంట్రీ ఉంటుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube