హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద అఖిలపక్షం నేతలు ధర్నాకు దిగారు.నిరుద్యోగుల గోస – అఖిలపక్షం భరోసా పేరుతో నిరసన దీక్ష చేపట్టారు.
కాంగ్రెస్, న్యూ డెమక్రసీ, బీఎస్పీ, టీజేఎస్ తో పాటు ఆప్ పార్టీలకు చెందిన నేతలు దీక్షలో పాల్గొన్నారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శితో పాటు బోర్డు సభ్యులను తొలగించాలన్నారు.కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.







