ఏజెంట్ ( agent )ఫ్లాప్ తో మళ్లీ కెరీర్ మొదటికే వచ్చినట్టు ఫీల్ అవుతున్న అఖిల్ తన నెక్స్ట్ సినిమాను కొత్త డైరెక్టర్ తో చేస్తున్నాడు.యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా విషయంలో అఖిల్ చాలా జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది.
ముఖ్యంగా ఈ సినిమా హీరోయిన్ విషయంలో అఖిల్ తన రిఫరెన్స్ అందిస్తున్నాడట.తనతో ఆల్రెడీ బ్యాచిలర్ సినిమా చేసిన పూజా హెగ్దేనే ఈ సినిమాలో తీసుకోవాలని చెబుతున్నాడట అఖిల్.
తన కెరీర్ లో మొదటి కమర్షియల్ హిట్ బ్యాచిలర్ సినిమా అందుకే హిట్ సెంటిమెంట్ రిపీట్ అయ్యేలా పూజానే మళ్లీ హీరోయిన్ గా చేయాలని అనుకుంటున్నాడు అఖిల్.
ధీర టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా పీరియాడికల్ మూవీగా వస్తుంది.
ఈ సినిమాలో అఖిల్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది.అఖిల్ పూజా హెగ్దే( Pooja Hegde ) ఇద్దరు మరోసారి కలిసి ధీర సినిమాలో రొమాన్స్ చేయనున్నారు.
ఏజెంట్ ఫ్లాప్ నుంచి త్వరగానే బయట పడిన అఖిల్ ధీర తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.అంతేకాదు ఈ సినిమాతో పాటుగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో కూడా ఒక సినిమా ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది.







