తిరుపతి: అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ ప్రమోషన్లో భాగంగా తిరుపతి నగరంలోని ఓ ప్రైవేటు హోటల్ లో మీడియా సమావేశం నిర్వహించారు.నేను అక్కినేని వారసుడిగా కంటే, అఖిల్ గానే ఉండటానికి ట్రై చేస్తాను.
ప్రేక్షకులు నన్ను ఓన్ చేసుకుంటే నాకు హ్యాపీ.
అక్కినేని వారసత్వం గురించి ఆలోచిస్తే అదే మూసలోకి వెళ్లిపోతాను.
నేను నా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాను.సక్సెస్ లు వచ్చినా, ఫెయిల్యూర్ లు వచ్చినా చివరి దాకా నాలాగే ఉండేందుకు ప్రయత్నిస్తాను.







