హాట్ పర్ఫామెన్స్ తో రెచ్చిపోయిన అఖిల్, తేజస్వి.. ఇజ్జత్ తీయకండంటూ నెటిజన్స్ ఫైర్?

Akhil And Tejwasi, Excited With Hot Performance ,Akhil, Tejwasi,hot Performance, Entertainment Shows,BB Jodi Program,Srimukhi Anchor,Radha, Sada

ప్రస్తుతం బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోస్ బాగా సందడి చేస్తున్నాయి.కామెడీ, రియాలిటీ, డాన్స్, ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారమవుతూ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసుకుంటున్నాయి.

 Akhil And Tejwasi, Excited With Hot Performance ,akhil, Tejwasi,hot Performance,-TeluguStop.com

ఇప్పటికే ఇటువంటి షోలు బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాయి.అయితే ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ షోస్ అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ వరకు మాత్రమే ఉండేవి.

ఇప్పుడు వచ్చేవి అలా కాదు అది ఎంటర్టైన్మెంట్ షో అయినప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్ తక్కువ రొమాన్స్ ఎక్కువగా అన్నట్లుగా కొనసాగుతున్నాయి.

ఇప్పటికే బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ ఇటువంటి విషయంలో బాగా విమర్శలు ఎదుర్కొంది.

ఈ షోలో కామెడీ కంటే డబల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ షోను చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడటం లేదు.పలుసార్లు ఈ షో పై కొందరు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఈ షోలో పాల్గొనే కమెడియన్స్ మాత్రం అవన్నీ పట్టించుకోకుండా డబల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్నారు.

ఇక ఢీ డాన్స్ షో చూస్తే మాత్రం ఇందులో డాన్స్ కంటే ఎక్కువగా సర్కస్ ఉంటుందని చెప్పవచ్చు.ప్రతి షో ఇలానే నడుస్తుంది.

ఈ మధ్య సెలబ్రెటీలతో కూడా కొన్ని రకాల షోస్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు.ఇప్పటికే బుల్లితెర నటీనటులతో చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి.

అయితే తాజాగా బిబి జోడి ప్రోగ్రాం స్టార్ మా లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఇందులో శ్రీముఖి యాంకర్ గా చేయగా.ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ, సదా జడ్జిలుగా బాధ్యతలు చేపట్టారు.ఇందులో బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లు పాల్గొని తమ డాన్సులతో బాగా సందడి చేస్తున్నారు.

ఇక ఈ షో అతి తక్కువ సమయంలో మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.ఇక ప్రేక్షకులు కూడా బిగ్బాస్ కంటెస్టెంట్ల పర్ఫామెన్స్ కాబట్టి చూడటానికి ఇష్టపడుతున్నారు.

చాలావరకు అందరూ బాగానే పర్ఫామెన్స్ చేస్తున్నారు.కానీ తాజాగా అఖిల్, తేజస్వి చేసిన పర్ఫామెన్స్ కు నెటిజన్స్ బాగా ఫైర్ అవుతున్నారు.

తాజాగా వచ్చే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.అందులో వీరిద్దరూ ఒక పర్ఫామెన్స్ చేయగా అందులో డాన్స్ కంటే ఎక్కువగా రొమాన్స్ కనిపించింది.

తేజస్వి వేసుకున్న డ్రెస్ కూడా చాలా హాట్ గా కనిపించింది.

దీంతో ఆ వీడియో చూసి నెటిజన్స్ బాగా ఫైర్ అవుతున్నారు.దీనికంటే వెళ్లి ఆ వీడియోలు చేసుకోండి.సినిమాలు ఎందుకు, ఇటువంటి టీవీ షోలు అని చెప్పి టీవీ షోస్ కు ఉన్న గౌరవాన్ని నాశనం చేస్తున్నారు.

ఇలాంటి షోస్ ఫ్యామిలీతో కలిసి చూడగలరా.మీకు డాన్స్ రాకపోతే చేయకండి.

కానీ గెలవడానికి, అట్రాక్ట్ చేయటానికి  ఇటువంటి పర్ఫామెన్స్లు చేసి టీవీ షోస్ కి ఉన్న ఇజ్జత్ తీయకండి అంటూ కామెంట్ ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube