అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) తాజాగా ఏజెంట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.దాదాపుగా రూ.80 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా కాస్త కనీసం 10 కోట్ల వసూళ్లను రాబట్టలేక పోయింది.దాంతో అఖిల్ తదుపరి సినిమా ఏంటా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అఖిల్ ఎన్ని సినిమాలు నిరాశ పర్చినా కూడా అక్కినేని ఇంటి ఫ్యామిలీ వారసుడు కనుక ఆయనతో సినిమాలను నిర్మించేందుకు చాలా మంది నిర్మాతలు ముందుకు వస్తారు.అంతే కాకుండా అఖిల్ కోసం పదుల సంఖ్యలో కొత్త దర్శకులు సీనియర్ దర్శకులు కథ లు పట్టుకుని రెడీగా ఉంటారు.
అయితే ఇప్పటికిప్పుడు సినిమాలు చేసే ఉద్దేశ్యం తనకు లేదు అంటూ అఖిల్ తన వద్దకు వచ్చిన నిర్మాతలతో చెప్పినట్లుగా తెలుస్తోంది.కనీసం ఆరు నెలల సమయం తీసుకుని ఈ ఏడాది చివర్లో సినిమా ను పట్టాలెక్కించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఆకట్టుకునే విధంగా ఒక మంచి కథను ఎంపిక చేసుకోవడం తో పాటు ప్రతిభావంతుడు అయిన దర్శకుడితో అఖిల్ తదుపరి సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.అదే కనుక జరిగితే అఖిల్ సినిమా కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.ఏజెంట్( Agent ) సినిమా తాలూకు ఫిజిక్ నుండి అఖిల్ బయటకు రావాల్సి ఉంటుంది.అంతే కాకుండా అతి త్వరలోనే అఖిల్ విదేశీ యాత్రకు వెళ్లబోతున్నాడు.అక్కడ కనీసం నెల రోజుల పాటు ఉంటాడట.తద్వారా కాస్త ఏజెంట్ జ్ఞాపకాల నుండి రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి అఖిల్ తదుపరి సినిమా విషయంలో కాస్త ఎక్కువ సమయం తీసుకుంటాడని తెలుస్తోంది.ఏజెంట్ సినిమా యొక్క ఫలితం అఖిల్ లో మార్పు తీసుకు వచ్చిందనే వార్తలు వస్తున్నాయి.
ఆ మార్పు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.