అలనాటి తార అభిమానులంతా ఎంతో ఇష్టంగా పిలుచుకునే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే.ఈ అమ్మడికి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి.
ఇక ఈ అమ్మడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈ విషయంపై జాన్వీ కపూర్ తండ్రి బోణీ కపూర్ నిజం ఏ మాత్రం లేదని స్పష్టం చేసాడు.అలాగే మంచి కథ చెప్తే ఈమె తెలుగులో కూడా నటిస్తుంది అని స్పష్టం చేసాడు.
అయితే మరి ఇన్నాళ్లకు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది.
ఈమె అక్కినేని హీరోతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రెసెంట్ అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమా తర్వాత అఖిల్ తో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఒక పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడట.

ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా జాన్వీ కపూర్ అయితే బాగుంటుంది అని ఆయన అనుకుని జాన్వీ కపూర్ ను సంప్రదించారట.ఈ ప్రాజెక్ట్ విషయంలో జాన్వీ పాజిటివ్ గా స్పందించడంతో ఈమె ఎంట్రీ అఖిల్ తో కన్ఫర్మ్ అని తెలుస్తుంది.ఈ సినిమాను త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
మరి జాన్వీ ఎంట్రీ ఈ సినిమా తో అయినా కన్ఫర్మ్ నా కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.







