Ajith : బ్రెయిన్ ట్యూమర్ బారిన పడిన హీరో అజిత్.. 4 గంటల శ్రమించి శస్త్ర చికిత్స చేసిన డాక్టర్స్?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అజిత్( Ajith ) ఒకరు.

ఈయన ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా అజిత్ తన వ్యక్తిగత విషయాల పట్ల కూడా ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉంటారు.ముఖ్యంగా ఆరోగ్య విషయంలో అజిత్ ఏమాత్రం కాంప్రమైజ్ కారు.

ఈయన ఆరోగ్యం పై( Health ) దృష్టి పెట్టి పెద్ద ఎత్తున వర్క్ అవుట్ చేయడమే కాకుండా ఎంతో న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు.

ఇలా తరచూ జనరల్ పరీక్షలు చేయించుకునే అజిత్ ఇటీవల చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో( Chennai Apollo Hospital ) కూడా జనరల్ చెకప్ కోసం వెళ్లారు అయితే ఇలా జనరల్ చెకప్ చేయించుకున్నటువంటి ఈయనకు ఊహించని షాక్ తగిలింది.తన బ్రెయిన్ లో ట్యూమర్( Brain Tumor ) ఉందని విషయాన్ని వైద్యులు వెల్లడించడంతో ఒకసారిగా అజిత్ షాక్ అయ్యారు.అయితే ఈయనకు వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేసి ఆ ట్యూమర్ తొలగించారని తెలుస్తోంది.

Advertisement

అపోలో ఆసుపత్రిలో డాక్టర్ పెరియగరుప్పన్ నేతృత్వంలోని వైద్యుల బృందం 4 గంటలు శ్రమపడి అజిత్‌కు శస్త్రచికిత్స చేసి అతని మెదడు నుండి ట్యూమర్ తొలగించారని కోలీవుడ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈయన ఆరోగ్యం గురించి వార్తలు వస్తున్నాయి.ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఈయన తొందరగా కోలుకోవాలని క్షేమంగా బయటికి రావాలి అంటూ ఆకాంక్షిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది.

కానీ ఈ విషయం గురించి అజిత్ టీమ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

Advertisement

తాజా వార్తలు