తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది యంగ్ డైరెక్టర్ లలో అజయ్ భూపతి( Director Ajay Bhupathi ) ఒకరు.ఈయన మంగళవారం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇప్పుడు అజయ్ భూపతి పేరు ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినిపిస్తుంది.ఇక ఇలాంటి క్రమంలోనే ఈయన ఇప్పుడు చాలా సినిమాలు చేయబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈయన తన నెక్స్ట్ సినిమాని నితిన్( Nithin ) హీరోగా చేయబోతున్నట్టుగా వార్తలయితే వస్తున్నాయి.ఇక ఇప్పటికే నితిన్ ను కలిసి అతనికి ఒక మంచి కథ చెప్పినట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమా సక్సెస్ అవడంతో అజయ్ భూపతితో సినిమా చేయడానికి నితిన్ కూడా ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది.అదొక ప్యూర్ లవ్ స్టోరీ( Love Story ) గా తెరకెక్కించాలని ఏమాత్రం వల్గారిటీ లేకుండా క్లీన్ యు సర్టిఫికెట్ సినిమా లాంటిది చేయాలని అజయ్ భూపతి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే నితిన్ తో సినిమా చేసి హిట్టు కొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…అయితే ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లు అందరూ తమదైన రీతిలో విభిన్నమైన కథంశలను తెరకెక్కిస్తూ సినిమాలుగా చేస్తూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు కానీ అజయ్ భూపతి మాత్రం తనదైన మేకింగ్ స్టైల్ ను నమ్ముకుని ముందుకు కదులుతూ హిట్లు అందుకుంటున్నాడు.
ఇక మధ్యలో వచ్చిన మహాసముద్రం సినిమా( Maha Samudram ) ఫెయిల్ అయినప్పటికీ ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకొని ప్రేక్షకుల్ని అలరించాడు.ఇక ప్రస్తుతం నితిన్ కూడా ప్లాపుల్లో ఉన్నాడు దానికి తోడుగా ఇప్పుడు ఒక వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఎక్స్ ట్రా అనే సినిమా చేస్తున్నాడు.ఇక వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు.
ఇక ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే అజయ్ భూపతి సినిమా కూడ చేయబోతున్నట్టు గా వార్తలు వస్తున్నాయి…
.