బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన ఐశ్వర్యారాయ్( Aishwarya Rai ) వయస్సు పెరుగుతున్నా ఆమె గ్లామర్ ఏ మాత్రం తగ్గడం లేదు.ఐశ్వర్యారాయ్ వయస్సు 50 సంవత్సరాలు కాగా డైరెక్ట్ గా ఆమెను చూసిన వారెవరూ ఆమె వయస్సు గురించి నమ్మరు.
ఐశ్వర్యారాయ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా తాజాగా కూతురు ఆరాధ్య గురించి ప్రస్తావిస్తూ ఐశ్వర్యారాయ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ఆరాధ్యనే నా జీవితం అని ఆరాధ్య( Aaradhya Bachchan ) కోసమే నేను బ్రతికి ఉన్నానని ఐశ్వర్యారాయ్ తెలిపారు.నీ రాకతో నా లైఫ్ లోకి వెలుగు వచ్చిందని ఆమె అన్నారు.ఆరాధ్యను నేను అనంత విశ్వం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఐశ్వర్యారాయ్ చెప్పుకొచ్చారు.
నాకు అత్యంత విలువైన ఆరాధ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నానని ఆమె కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఐశ్వర్యారాయ్ ఆరాధ్య విషయంలో చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఆరాధ్య, అభిషేక్( Abhishek Bachchan ) కలిసి దిగిన ఫోటోలను ఐశ్వర్యారాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.కూతురిపై ఐశ్వర్యారాయ్ చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఐశ్వర్యారాయ్ తన యాక్టింగ్ స్కిల్స్ తో సైతం నెటిజన్లను, అభిమానులను మాయ చేస్తున్నారు.
ఐశ్వర్యారాయ్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 13 మిలియన్లుగా ఉంది.ఐశ్వర్యారాయ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఐశ్వర్యరాయ్ రెమ్యునరేషన్( Remuneration ) సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉండనుందని సమాచారం అందుతోంది.
కెరీర్ విషయంలో ఈ బ్యూటీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ఈ జనరేషన్ ఫ్యాన్స్ లో కూడా ఎంతోమంది ఐశ్వర్యారాయ్ ను అభిమానిస్తున్నారు.
ఐశ్వర్యారాయ్ కూతురు సినిమాల్లోకి వస్తారో లేదో తెలియాల్సి ఉంది.