తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఐశ్వర్యరాయ్.
ఇది ఇలా ఉంటే తాజాగా ఐశ్వర్య రాయ్ కి సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అదేమిటంటే ఐశ్వర్య కి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు.
సిన్నార్ లోని ఒక భూమికి సంబంధించి ఐశ్వర్య ట్యాక్స్ కట్టకపోవడంతో వాళ్ళు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
దాదాపుగా ఏడాది నుంచి ఆ భూములకు సంబంధించిన టాక్స్ చెల్లించకపోవడంతో ఈ విధంగా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
కేవలం ఐశ్వర్యరాయ్ మాత్రమే కాకుండా ఆమెతో పాటుగా మరో 1200 మంది కూడా టాక్స్ లు కట్టకపోవడంతో వారికి కూడా నోటీసులు అందినట్టు తెలుస్తోంది.ఈ నోటీసులను అందుకున్న వారిలో బడా కంపెనీలు కూడా ఉన్నట్టుగా సమాచారం.వాళ్ళందరూ కూడా టాక్స్ లు ఎగ్గొట్టడంతో ప్రభుత్వానికి రావాల్సిన 1.11 కోట్లు నష్టం వచ్చినట్టుగా తెలుస్తోంది.

దాంతో మార్చిలోపు కట్టకుండా ఉన్న టాక్స్ అంతటినీ క్లియర్ చేయాలని వారికి నోటీసులు జారీ చేశారు రెవెన్యూ అధికారులు.ఐశ్వరరాయ్ మొత్తంగా రూ.21,960 పన్ను చెల్లించాల్సి ఉంటుంది అని తెలుస్తోంది.10 రోజులలోపు చెల్లించకపోతే మహారాష్ట్ర భూ రెవెన్యూ చట్టం 1996 లోని సెక్షన్174 ప్రకారం ఐశ్వర్య పై పైన చర్యలు తీసుకుంటాము అని నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇకపోతే ఐశ్వర్యారాయ్ విషయానికి వస్తే ఇటీవల విడుదల అయిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ లో బిజీబిజీగా గడుపుతోంది ఐశ్వర్య.ఇటీవల విడుదలైన ఈ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంది ఐశ్వర్య.
ఈ సినిమా తర్వాత ఆమె ఇంకొన్ని సినిమాలలో నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.ఈ మేరకు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.







