బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) అంటే తెలియని సినీ ప్రేమికులు ఉండరు.ఈమె మిస్ వరల్డ్ గా ప్రపంచాన్ని గెలవడమే కాకుండా తన నటనాభినయంతో ప్రేక్షకుల మదులను గెలుచుకుంది.
అలాంటి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ బిగ్ బీ గా పేరు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఇంటికి కోడలుగా వెళ్ళింది.అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడి ఆయనను పెళ్లి చేసుకొని ఒక పాపకు కూడా జన్మనిచ్చింది.
అయితే ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వీరి సంసారంలో ఎలాంటి గొడవలు వచ్చాయో తెలియదు కానీ గత రెండు మూడు నెలల నుండి వీరిద్దరూ విడాకులు( Divorce ) తీసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.ఇక చాలామంది సెలబ్రిటీలు వారిపై ఫేక్ వార్తలు చక్కర్లు కొడితే కచ్చితంగా క్లారిటీ ఇస్తారు.
కానీ అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) ఐశ్వర్యరాయ్ మీద చాలా రోజులుగా ఈ విడాకుల వార్తలు వినిపిస్తున్నప్పటికీ వీరు క్లారిటీ ఇవ్వకపోవడంతో వీరు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారు కావచ్చు అని అందరు భావిస్తున్నారు.అయితే తాజాగా బాలీవుడ్ మీడియాలో ఐశ్వర్యరాయ్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీని వదిలేసి బయటికి తన కూతుర్ని తీసుకొని వచ్చేసిందని, ప్రస్తుతం ఆమె వేరే ఇంట్లో ఉంటుందని తెలుస్తోంది.
అయితే ఒక ఆంగ్ల వెబ్సైట్ రాసిన దాని ప్రకారం చూసుకుంటే ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ కి విడాకులు ఇచ్చే పరిస్థితి అయితే లేదు.

కానీ ఇంట్లో గొడవల కారణంగా ఆమె దూరం ఉండాలనే నిశ్చయించుకుందట.ఎందుకంటే తన కూతుర్ని ఇలాంటి గొడవల వాతావరణంలో పెంచితే తన కూతురు మైండ్ డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇంటి నుండి బయటకు వచ్చేసిందని తెలుస్తోంది.అయితే అభిషేక్ బచ్చన్ తల్లి జయా బచ్చన్ కి( Jaya Bachchan ) కూడా ఐశ్వర్య కోడలుగా రావడం ఇష్టం లేదని,ఇప్పటికి కూడా తన కొడుకు మాజీ లవర్ అయినా కరిష్మా కపూర్ (Karishma Kapoor) అంటేనే తనకి ఇష్టమని,ఏదైనా పార్టీలో కనిపిస్తే ఐశ్వరరాయ్ కంటే ఎక్కువగా కరిష్మా కపూర్ తోనే నవ్వుతూ మాట్లాడుతుందనే వార్తలు ఇప్పటికే మీడియాలో వినిపించాయి.

అయితే గత కొద్ది రోజుల నుండి జయా బచ్చన్ (Jaya Bachchan) కి ఐశ్వర్యరాయ్ కి మధ్య సత్సంబంధాలు లేవట.వీరిద్దరి మధ్య తరచూ ఏదో ఒక విషయంలో గొడవలు వస్తున్నాయట.ఇక ఈ గొడవల్లో అభిషేక్ తల దూర్చడం వల్ల ఐశ్వర్య కి అభిషేక్ కి మధ్య కూడా భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతుండడంతో ఐశ్వర్యరాయ్ తన కూతుర్ని తీసుకొని ఇంటి నుండి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.అయితే ఐశ్వర్య రాయ్ పుట్టినరోజున కూడా అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా ఆమెకు విష్ చేయలేదు.
అలాగే తన బర్త్డే వేడుకలను కూడా తన కూతురు అలాగే తన తల్లితో కలిసి చేసుకుంది.ఇక ఈమె బర్త్డే రోజు అభిషేక్ ఒక సింపుల్ మెసేజ్ పెట్టారు అంతే.
దాంతో వీరు విడాకుల వార్తలు ఎక్కువయ్యాయి.అయితే వీరు విడాకులు తీసుకుంటారా లేదా పెద్ద ఫ్యామిలీ కావడంతో కుటుంబ పరువు పోకుండా ఇద్దరు కాంప్రమైజ్ అయిపోతారా అనేది తెలియాల్సి ఉంది.