వ్యాక్సిన్ కోసం పైలట్ల డిమాండ్.. విమానాలు నడపమంటున్న పైలట్ల సంఘం..!

కరోనా సెకండ్ వేవ్ విజృంభన ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే.కరోనా బారిన పడి కోలుకుంటున్న వారితో పాటుగా మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది.

 Airindia Pilots Demand For Corona Vaccination-TeluguStop.com

ఇలాంటి టైం లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత వేగవంతం చేస్తే అంత మంచిదని ప్రభుత్వాలు అనుకుంటున్నాయి.అయితే వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతున్నా కేసులు మాత్రం రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి.

ఇక ఈ క్రమంలో తమకు వ్యాక్సిన్ కావాలని కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.వారిలో ప్రధానంగా ఎయిర్ ఇండియా పైలట్లు తమకు వ్యాక్సిన్ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

 Airindia Pilots Demand For Corona Vaccination-వ్యాక్సిన్ కోసం పైలట్ల డిమాండ్.. విమానాలు నడపమంటున్న పైలట్ల సంఘం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమకు వ్యాక్సినేషన్ నిర్వహించకపోతే తాము విమానాలు నడపమని ఎయిర్ ఇండియా పైలట్ల సంఘం (ఐసీసీఏ) హెచ్చరించింది.వ్యాక్సిన్ క్యాంపులను నిర్వహించి తమకు వ్యాక్సిన్ ప్రక్రియ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురికి పైలట్ల సంఘం లేఖ రాశారు.పాండమిక్ టైం లో తమ సేవలను గుర్తించాలని వారు కోరారు.

అంతేకాదు నెలవారి జీతాలు అంతకుముందు లానే ఇవ్వాలని కోరారు.వేతనాల్లో కోతలు చాలాకాలంగా సాగుతుందని పైలట్లు ఆందోళన వ్యక్తం చేశారు.

పైలట్లని కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించాలని వారు కోరారు.వ్యాక్సినేషన్ ప్రక్రియ మాకు ఎందుకు నిర్వహించడం లేదో తెలపాలని అన్నారు.

అనేకమంది ప్రయాణీకులు విమానాల్లో ఎక్కుతుంటారని తక్షణమే తమకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎయిర్ ఇండియా పైలట్లు.

#Corona #COvid #Pilots #AirIndiaPilots #AirIndia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు