ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా.. గగనతలం క్లోజ్, వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం

హెచ్చరికలు, ఆంక్షలకు తాను భయపడేది లేదని తేల్చిచెప్పిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలెట్టారు.

తూర్పు ఉక్రెయిన్‌పై దాడి చేయాలని.రష్యా సైన్యాన్ని ఆయన ఆదేశించారు.పుతిన్ ఆదేశాల మేరకు రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది.

ఇప్పటికే రష్యా బలగాలు సరిహద్దు దాటి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాయి.లుహాన్స్క్‌ ప్రాంతంలోని రెండు గ్రామాలను స్వాధీనం చేసుకున్నాయి.

అయితే రష్యా దాడులకు ఉక్రెయిన్ సైన్యం కూడా ధీటుగా స్పందిస్తోంది.రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని ప్రజలు నగరాన్ని విడిచిపెట్టి వెళుతున్నారు.

Advertisement

దీంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.అటు అన్ని దేశాలు ఉక్రెయిన్‌లోని తమ పౌరులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలను నడుపుతోన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే భారత్ కూడా మన పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఎయిరిండియా విమానాలను పంపుతోంది.ఇప్పటికే కొందరిని ఢిల్లీ తీసుకొచ్చింది కేంద్రం .అయితే ఈరోజు రష్యా యుద్ధ ప్రకటన కారణంగా ఉక్రెయిన్ తమ గగనతలాన్ని మూసివేసింది.దీని కారణంగా ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరుల్ని తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి వెళ్లిన ఎయిరిండియా ప్రత్యేక విమానం వెనక్కి వచ్చేసింది.

మరోవైపు రష్యా దాడి నేపథ్యంలో ఇళ్ల నుండి బయటకు రావొద్దని ఉక్రెయిన్‌లో ఉన్న మనదేశ పౌరులకు భారత ఎంబసీ సూచించింది.ఉన్నత విద్యను అభ్యసించేందుకు భారతీయులు ఎక్కువగా ఉక్రెయిన్ వెళ్తారు.తాజా పరిస్ధితి నేపథ్యంలో విద్యార్ధులు తాము ఉంటున్న హాస్టల్స్, రెస్టారెంట్లు, ఇళ్ల నుండి బయటకు రావొద్దని ఇండియన్ ఎంబసీ కోరింది.

అలాగే భారతీయులెవరూ కూడా కీవ్ పట్టణానికి వెళ్లవద్దని సూచించింది.కీవ్‌లోని పశ్చిమ ప్రాంతాల నుండి ప్రయాణించే వారిని వారి నగరాలకు తిరిగి రావాలని కూడా కోరింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020
Advertisement
" autoplay>

తాజా వార్తలు