వీడియో: పబ్లిక్‌లో ప్రాంక్ చేశాడు.. చెంప పగల కొట్టించుకున్నాడు..

ఈ రోజుల్లో పాపులర్ కావడానికి యువత మంచి మార్గాల కంటే చెడు మార్గాలనే ఎంచుకుంటున్నారు.సోషల్ మీడియా( Social Media ) ప్రభావం వల్ల వారు మరింత చెడిపోతున్నారు.

 Air Horn Prank Gone Wrong Man Slaps Prankster Video Viral Details, Latest News,-TeluguStop.com

కొందరు ప్రాంక్ వీడియోల( Prank Videos ) పేరిట ప్రజలను ఇబ్బంది పెడుతూ అందరి ఆగ్రహానికి గురవుతున్నారు.వీరి ఆగడాలకు సామాన్య ప్రజలు వణికిపోతున్నారు.

కొందరు మాత్రం ఇలా ఇబ్బంది పెట్టే ప్రాంక్‌స్టర్స్( Pranksters ) చెంప పగలగొడుతున్నారు.తాజాగా ఇదే కోవకు చెందిన ఒక వీడియో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో ప్రాంక్ చేసి ఓ వ్యక్తి చేతిలో చెంపదెబ్బ తిన్న ప్రాంక్‌స్టర్‌ కనిపించాడు.దీన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.ఇలాంటి వారికి ఇదే తగిన శాస్తి అని అంటున్నారు.వైరల్ వీడియో ఓపెన్ చేయగానే మనకు రోడ్డుపైన తన దారిన తాను వెళుతున్న ఒక వ్యక్తిని చూడవచ్చు.

అలా వెళ్తున్న వ్యక్తి చెవిలో అదే రోడ్డుపై నిల్చున్న ఒక ప్రాంక్‌స్టర్ హార్న్‌ ఊదాడు.దాంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.

“చెవిలో హార్న్‌ను ఊదడమేంట్రా, పిచ్చా నీకేమైనా” అంటూ అతను బాగా ఆగ్రహంతో ఊగిపోయాడు.అంతేకాదు, ప్రాంక్‌స్టర్ చెంప చెల్లుమనిపించాడు.దాంతో ఆ ప్రాంక్‌స్టర్‌కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది.ఇంతలోనే మరొక యువకుడు అక్కడికి వచ్చాడు.బహుశా అతను ఈ ప్రాంక్‌స్టర్‌కి చెందినవాడే అయ్యుండొచ్చు.అతను కోపంతో ఉన్న అంకుల్‌ను శాంతింప చేయడానికి ప్రయత్నించాడు.

ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కాస్త వైరల్ అయింది.దీన్ని చూసి నెటిజన్లు తెగ అనుకుంటున్నారు.ఎవరికి ఎలాంటి హాని తలపెట్టని ప్రాంక్స్ చేసుకోవాలి గాని ఇలా ప్రజలను ఇరిటేట్ చేస్తే ఇలాంటి శాస్తే జరిగిద్ది అని కొందరు కామెంట్స్ పెట్టారు.ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ @the_baigan_vines షేర్ చేసిన ఈ వీడియోకి 2.5 లక్షల లైక్‌లు, మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube