కరోనా ఎఫెక్ట్: వైరస్ సోకకుండా గాలి బుడగల్లో ప్రయాణం...!

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ముఖ్యంగా చాలా మంది కరోనా వైరస్ చూపుతుందన్న భయం లేకుండా వారి ఇష్టానుసారం రోడ్లపైనే తిరుగుతున్నారు.

దీంతో అనేక మంది కరోనా వైరస్ బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే దీనిని ఎదుర్కొనేందుకు అనేక మంది అనేక ప్రయత్నాలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

తాజాగా ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్ కు చెందిన ఓ యువకుడు సరికొత్త ఆలోచన చేశాడు.తాను గాలి బుడగలోకి దూరి రోడ్డుపై ప్రయాణిస్తున్నాడు.

తాను ఎక్కడికి వెళ్లాలన్న సరే పూర్తిగా గాలిబుడగలోనే దూరి రోడ్డుపై ప్రయాణం చేస్తున్నాడు.అయితే ఇది ఇబ్బందిగా ఫీల్ కావట్లేదని, తనకు స్వేచ్ఛ దొరికిందని అతడు ఫీలవుతున్నాడు.

Advertisement

అంతేకాదు తనకు ఎట్టిపరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందదని అతను ఫీల్ అవుతున్నాడు.ఆ గాలి బుడగ పారదర్శకమైనది కాబట్టి లోపల అతను క్లియర్గా బయటివారికి కనబడుతున్నాడు.

దీంతో అతని ఆలోచన బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు.అయితే ఈ ప్రయాణంలో అతడు ఎలాగో బెలూన్ లో ఉన్నాడు కాబట్టి అతడు ముఖానికి ఫేస్ మాస్క్ పెట్టుకోలేదు.

దీంతో అతడు ఎవరని శోధన చేయగా చివరికి బెల్ గ్రేవ్ ప్రాంతానికి చెందిన వాడని తేలింది.అయితే అతను అలా రోడ్డు మీద అ బుడగలో వెళ్తున్న సమయంలో చాలా మంది అతని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో అతనుకు సంబంధించిన వీడియోలు కాస్త వైరల్గా మారాయి.నిజానికి అలాంటి బుడగలు కేవలం పిల్లలు నీటిలో ఆడుకునేందుకు ఉపయోగిస్తారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కాకపోతే ఇప్పుడు అవి కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు అతనికి ఇలా ఉపయోగపడ్డాయి.ఇక ఈ వీడియోలకు సంబంధించిన నెటిజన్లు వారి స్టైల్ లో కామెంట్స్ ను జత చేస్తున్నారు.

Advertisement

చాలామంది నెటిజెన్స్ కొత్తగా ప్రయత్నించడం మంచిది అని కామెంట్ చేస్తున్నారు.అయితే అందరూ ఇలానే చేయడం సరి కాదని తెలుపుతున్నారు.

తాజా వార్తలు