పవిత్ర నగరమైన అయోధ్యలో రామమందిరం( Ram Mandir ) నిర్మించిన సంగతి తెలిసిందే.జనవరి 22న ఈ ఆలయంలో రాముడు, అతని కుటుంబ సభ్యుల విగ్రహాలను ప్రతిష్టించడానికి “ప్రాణ్ ప్రతిష్ఠ” అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
జనవరి 23న ఆలయం ప్రజల సందర్శన, పూజల కోసం ఓపెన్ అవుతుంది.ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi )తో పాటు ఇతర వీవీఐపీలు హాజరుకానున్నారు.
భక్తులలో ఈ కార్యక్రమంపై, ఆలయ ఓపెనింగ్ పై ఎంతో ఆసక్తి నెలకొన్నది.ఈ రామాలయం గురించి నెటిజన్లు అనేక విషయాలు పంచుకుంటూ భక్తి భావనను మరింత పెంచుతున్నారు.ఈ క్రమంలోనే ఒక డిజిటల్ క్రియేటర్ AIని ఉపయోగించి కొన్ని ఫన్నీ, క్రియేటివ్ ఇమేజ్‌లు రూపొందించారు.ఆలయ కార్యక్రమ సన్నాహాలలో కొన్ని ప్రముఖ సినీ క్యారెక్టర్స్ హెల్ప్ చేస్తే ఎలా ఉంటుందో ఊహత్మకంగా ఏఐ ద్వారా అతడు ఇమేజ్‌లు క్రియేట్ చేశాడు.
ఆ ఇమేజ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అవి బాగా పాపులర్ అయ్యాయి.
ఈ ఇమేజ్‌లలో మార్వెల్( Marvel ), DC కామిక్స్, స్టార్ వార్స్, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, హ్యారీ పోటర్ సినిమాలోని క్యారెక్టర్స్ కనిపించాయి.ఆ ఇమేజ్‌లలో వీరంతా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయంలో వివిధ పనులు చేస్తున్నారు.ఉదాహరణకు, ఐరన్ మ్యాన్, బాట్‌మాన్ ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు, స్పైడర్‌మ్యాన్, హల్క్ ఒక పవిత్ర వ్యక్తికి ఆహారం ఇస్తున్నారు, డెడ్‌పూల్, జోకర్ పూజారులకు సహాయం చేస్తున్నారు, సూపర్‌మ్యాన్ చాలా పువ్వులు మోస్తున్నారు, జాక్ స్పారో, వండర్ వుమన్ దీపాలు వెలిగిస్తున్నారు, థోర్ & లోకి సంగీతాన్ని ప్లే చేస్తూ, థానోస్, గ్రూట్ ఆహారాన్ని వండుతున్నారు, డాక్టర్ స్ట్రేంజ్, జాన్ స్నో ఆహారాన్ని అందిస్తున్నారు.
హ్యారీ, హెర్మియోన్, రాన్ సెల్ఫీ తీసుకుంటున్నారు.చాలా మంది ఈ ఇమేజ్‌లపై వ్యాఖ్యానిస్తున్నారు, డిజిటల్ క్రియేటర్‌ను ప్రశంసించారు.