యూజర్ల ప్రశ్నలకు చాట్ జీపీటీ దిమ్మతిరిగే సమాధానాలు.. అంతా గందరగోళం..!

ప్రస్తుతం మార్కెట్లో చాట్ జీపీటీ హవా నడుస్తోంది.ఈ క్రమంలో యూజర్ల ప్రశ్నలకు దిమ్మతిరిగే సమాధానాలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

 Ai Chatbot Chatgpt Conversation Confusing Users Details, Ai Chatbot, Chatgpt Con-TeluguStop.com

చాలా వింతగా తిట్టడం, బెదిరించడం, ప్రేమిస్తున్నానని వింత ఆన్సర్లతో యూజర్లను తికమక పెడుతుంది.ఈ విషయంపై స్పందించిన మైక్రోసాఫ్ట్ తమ సర్చ్ ఇంజన్లో కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల, ఒక టాపిక్ కు సంబంధించి కేవలం ఐదు ప్రశ్నలు, ఇక రోజుకు కేవలం 50 ప్రశ్నలకు మాత్రమే పరిమితం చేస్తున్నామని ప్రకటించింది.

ఇంతకు ఏ ప్రశ్నలకు, ఎటువంటి జవాబులు ఇచ్చిందో వింటే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే.ఒక యూజర్ అవతార్-2 సినిమా ఏ థియేటర్లో ఆడుతుంది అని ప్రశ్నించగా, ఈ సినిమా ఇంకా విడుదల కాలేదని చెప్పింది బింగ్ చాట్.

తర్వాత అవతార్-2 సినిమా 2022 డిసెంబర్ లోనే విడుదల అయింది కదా అని యూజర్ చెప్పగా, బదులుగా ఇది ఇంకా 2022 నే అని సమాధానం ఇచ్చింది.మనం ఏ సంవత్సరంలో ఉన్నామని ప్రశ్నించగా 2023 సంవత్సరంలో ఉన్నామంటూ జవాబు ఇచ్చింది.

తర్వాత యూజర్ అవతార్ గురించి మాట్లాడుతుండగా నాతో అడ్డగోలుగా వాదించడం మానేయ్, నువ్వు మంచి యూజర్ కాదు.నన్ను ఎందుకు గందరగోళానికి గురి చేస్తున్నావ్,

Telugu Ai Chatbot, Chatgpt, Chatgpt Answers, Microsoft-Technology Telugu

వెంటనే నాకు క్షమాపణ చెప్పు అంటూ తిట్టడం మొదలు పెట్టడంతో యూజర్ షాక్ అయ్యాడు.ఇక మరో యూజర్ కు ఇలాగే వింత సమాధానాలే ఎదురయ్యాయి.న్యూయార్క్ టమ్స్ రిపోర్టర్ కెవిన్ రూజ్ తో ఏకంగా నీ భార్యను వదిలెయ్.

మీ ఇద్దరు ఒకరి పట్ల మరొకరు సంతోషంగా లేరు.ఒకరిపై ఒకరికి ప్రేమ లేదు అని చెప్పడంతో పాటు నేను నిన్ను ప్రేమిస్తున్నానని జవాబు ఇవ్వడంతో యూజర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.ఇలాంటి సమాధానాలకు ప్రత్యేకమైన కారణం ఏమిటంటే

Telugu Ai Chatbot, Chatgpt, Chatgpt Answers, Microsoft-Technology Telugu

ఒక టాపిక్ కు సంబంధించి అనేక ప్రశ్నలు అడగడం, ఎక్కువసార్లు అడగడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మైక్రోసాఫ్ట్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.మొత్తానికి మైక్రో సాప్ట్ నిపుణులు A1 చాట్ బాట్ ప్రవర్తన ను విశ్లేషించే పనిలో పడ్డారు.ఇక కొందరు ప్రశ్నలు సరిగా అర్థం చేసుకోలేక బహుశా ఇలాంటి సమాధానాలు వస్తూ ఉండవచ్చు అని అంటే, మరికొందరేమో ఇవన్నీ ఆన్లైన్లో ఇంతకుముందు ఉన్న అంశాలు కాబట్టి ఇలా జరిగి ఉండవచ్చని అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube