Chat GPT స్కూల్ పిల్లలకు పెట్టిన పరీక్షలో కూడా పాసై, శాస్త్రవేత్తలకు షాకిచ్చింది!

అవును, మీరు విన్నది నిజమే.Chat GPT ఇపుడు గూగుల్ కు మాత్రమే కాకుండా మానసిక శాస్త్రవేత్తలకు కూడా చెమటలు పట్టిస్తోంది.

 Ai Chatbot Chat Gpt Clears Children Psychology Exam Theory Of Mind-TeluguStop.com

తాజాగా తొమ్మిదేళ్ల పిల్లవాడికి నిర్వహించిన సైకాలజీ పరీక్షను పాస్ అయ్యింది.దీంతో చాట్ జీపీటీ సామర్థ్యం చూసి భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ఇంకెన్ని వింతలు సృష్టిస్తుందో అని ప్రపంచ ఉద్ధండులు ఆశ్చర్యపోతున్నారు.

చాట్ GPT అనేది మెషిన్ లెర్నింగ్ ఆధారిత AI టెక్నాలజీ అని అందరికీ తెలిసిందే.Chat GPTని ఓపెన్‌ ఏఐ రూపొందించింది.

మైక్రోసాఫ్ట్ కూడా ఈ టెక్నాలజీపై నిరంతరం పనిచేస్తోంది.

తాజాగా స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మైఖేల్ కోసిన్స్కి ChatGPT, శక్తి సామర్థ్యాలను చెక్ చేయడానికి మానసిక పరీక్షను నిర్వహించగా ప్రొఫెసర్ మైఖేల్ కోసిన్స్కి ‘థియరీ ఆఫ్ మైండ్’ టాస్క్‌ను పూర్తి చేయడానికి చాట్‌బాట్, విభిన్న వెర్షన్‌లను పరీక్షించడానికి ChatGPTని వినియోగించారు.నిజానికి పిల్లల మానసిక సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.ఆ పరీక్ష Chat GPTపై ప్రయోగించగా 9 ఏళ్ల పిల్లవాడిలా ఆలోచిస్తోందని తెలిసింది.

ఈ ప్రయోగం నవంబర్ 2022లో నిర్వహించారు.GPT 3.5లో శిక్షణ పొందిన Chat GPT వెర్షన్‌ను ఉపయోగించింది.

ఇక చాట్‌బాట్ కోసిన్స్కి థియరీ ఆఫ్ మైండ్ టాస్క్‌లలో 94% పరిష్కరించింది.కోసిన్ స్కీ చాట్‌బాట్‌ను 22 సంవత్సరాల సగటు వయస్సు ఉన్న అదే లీగ్‌లో ఉంచింది.కోసిన్స్కి ప్రకారం, భాషా నైపుణ్యాలు మెరుగుపడినప్పుడు ChatGPT ప్రాబబిలిటీ పెరుగుతుందన్నారు.

థియరీ ఆఫ్ మైండ్ టెస్టింగ్ గురించి మాట్లాడుతూ, వ్యక్తుల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగిస్తారని, అయితే ఈ పరీక్షలో అత్యంత కీలకమైన దశ ఒక వ్యక్తి నమ్మకాలను అర్థం చేసుకోవడం.ఈ పరీక్ష నాల్గవ దశ వ్యక్తి గురించి తెలుసుకోవడం కావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube