పానీపూరీ…( Panipuri ) అనగానే ముఖ్యంగా యువతకి నోటిలో నోళ్లూరుతాయి.మనదేశంలో మంచి గిరాకీ వున్న చిరు వ్యాపారాలలో పానీపూరీ ఒకటి.
దేశంలో చాలా మంది వీటిని ఇష్టంగా తింటుంటారు.ఇక్కడ సాయంత్రం అవ్వగానే చాలామందికి పానీపూరీ తినాలని అనిపిస్తూ ఉంటుంది.
ఇక వీటికి డిమాండ్ ఎక్కువ ఉండడంతో పానీపూరీ బండి దగ్గర వెయిటింగ్ కూడా అలాగే ఉంటుంది.దాంతో అందరినీ వరుస పెట్టీ లైన్ లో నిలబెట్టి మరీ పానీపూరీ సర్వ్ చేస్టుంటారు వ్యాపారులు.
ఇక కొన్ని చోట్ల రెడీమెడ్ గా తయారు చేసి ప్లేట్ లో పెట్టి ఇస్తారు.

ఈ క్రమంలోనే అహ్మదాబాద్ ఇంజనీర్ ఓ అద్భుతం క్రియేట్ చేశాడు.పానీపూరీ తయారీకి ఏకంగా ఒక యంత్రాన్ని తయారు చేశాడు.అది ఒక గంటలో 40 వేల పానీపూరీలు తయారు చేస్తుంది మరి.సాధారణంగా పానీపూరీ చేసే ప్రదేశాన్ని మీరు చూసినట్లయితే, మీరు పానీపూరీని ఇక తినలేరన్న ప్రచారముంది.అందుకే ఆకాష్( Akash ) పానీపూరి యంత్రాన్ని తయారు చేయాలని అనుకొని ఎట్టకేలకు విజయవంతంగా పానీపూరీ మెషీన్‌ను( Panipuri Machine ) తయారు చేశాడు.
ఈ యంత్రానికి మొత్తం 4 బెల్టులు ఉంటాయి.ముందుగా మిక్సింగ్ మెషీన్‌లో పిండి, నీరు వేయాలి.చివరి దశ పూరీని డీప్ ఫ్రై చేయడం.

అలా మెషిన్‌లోనే నూనెలో వేయించి పూరీని తయారుచేస్తారు.ఈ మెషిన్‌లో తయారు చేసిన పూరీ పగలకుండా, క్రిస్పీగా, మంచి షేప్ కలిగి ఉంటుంది.ఫోర్ బెల్ట్ మెషీన్ మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా ఆటోమేటిక్ మెషీన్.
ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న గుజరాతీలకు ఇది రకాలుగా ఉపయోగపడుతుంది.వారు దేశం వెలుపల స్వచ్ఛ్ పానీపూరీ యంత్రాలను కూడా ఎగుమతి చేస్తారు.2022 సంవత్సరంలో సుమారు 7 లక్షల 85 వేల రూపాయలతో ఈ యంత్రాన్ని తయారు చేసినట్లు ఆకాష్ గజ్జర్ తెలిపారు.
