‘డ్యాన్స్ ఐకాన్' షో ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన ఆహ

హైదరాబాద్, 22 ఆగష్టు – డాన్స్ అనే పదం వినపడగానే ప్రతి ఒక్కరికీ వారిలో ఉన్న ఒక డ్యాన్సర్ బయటికొస్తారు.కానీ అందులోంచి ఆణిముత్యాలని వెతికి, వారి ప్రతిభను లోకానికి చూపించడానికి ‘డాన్స్ ఐకాన్’ షో తో వచ్చేస్తుంది మన అందరికి ఎంతో ఇష్టమైన, 100 % లోకల్ ఓ టి టి ప్లాట్ ఫామ్ ఆహ.

 Aha Released The First Look Of The Show 'dance Icon' , Dance Icon, Aha, Omkar-TeluguStop.com

ఎప్పుడూ తన అభిమానులని ఎలా అలరించాలని ఆలోచించే ఆహ,తెలుగు ఇండియన్ ఐడల్ సక్సెస్ తర్వాత మరోసారి ప్రతిభ ఉన్న నృత్యకళాకారులతోటి వచ్చేస్తుంది.తెలుగు లోగిల్లలో అన్నయ్యా అని పిలవబడే ఓంకార్ ఈ షో కి యాంకర్ మరియు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.

ఈ షో యొక్క ఫస్ట్ లుక్ ను ఆహ 20 ఆగష్టు నాడు విడుదల చేసింది.

ఈ షో యాంకర్ మరియు ప్రొడ్యూసర్ ఓంకార్ మాట్లాడుతూ, “ఈ షో ద్వారా నేను ఓటిటి ప్లాట్ఫామ్ లోకి అడుగుపెడుతున్నాను.

నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, ఆహా కు ధన్యవాదములు.నేను ఎన్నో డ్యాన్స్ షోస్ చేశాను, కానీ ఇది చాల డిఫరెంట్ గా ఉండబోతుంది.

ఈ షో కంటెస్టెంట్స్ తో పాటు వారిని కొరియోగ్రాఫ్ చేసే మాస్టర్స్ జీవితాల్ని కూడా మార్చేస్తుంది.గెలిచిన కంటెస్టెంట్ యొక్క కొరియోగ్రాఫర్ కు టాలీవుడ్ లో ఒక పెద్ద హీరో కి డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం వస్తుంది.అందరు ఈ షో ని ఆదరిస్తారని భావిస్తున్నాను.”

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube