ఆహా, ఈ ఇల్లు ఎంత అందంగా ఉందో.. రైల్వే అధికారి పిక్స్ వైరల్!

తాజాగా ఒక భారతీయ రైల్వే అధికారి తన జూనియర్ సహోద్యోగి పెంచే అద్భుతమైన గార్డెన్ ఫొటోలను పంచుకున్నారు.ఆ ఫొటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.

 Aha, How Beautiful This House Is Railway Officer's Pics Are Viral, Indian Railwa-TeluguStop.com

ఈ ఫొటోలు ఆ జూనియర్ సహోద్యోగికి గార్డెనింగ్ పట్ల ఉన్న ప్రేమను కూడా చాటుతోంది.అతని ఇల్లు లక్నోలోని ఉంది.

ఇంట్లో ఎక్కడ చూసినా పూల చెట్లే ఉన్నాయి.ఇంటిలోని ప్రతి సందు అందమైన పూలతో అత్యంత సుందరంగా కనిపిస్తోంది.

పబ్లిక్ గార్డెన్‌ల కంటే ఈ హోంగార్డెన్ అత్యంత అందంగా ఉండటంతో చాలామంది తిని చూసి ఫీదా అవుతున్నారు.

ఇండియన్ రైల్వేస్ ఆఫీసర్ అనంత్ రూపనగుడి ట్విట్టర్‌లో ఈ బ్యూటిఫుల్ పిక్స్ పోస్ట్ చేస్తూ, “ఇది లక్నోలోని ఒక జూనియర్ సహోద్యోగి గార్డెన్.

ఇది అతని అద్భుతమైన గార్డెనింగ్ స్కిల్స్ చూపిస్తోంది.పువ్వుల పట్ల అతనికి ఉన్న ప్రేమను చూపుతుంది! ప్రతి సంవత్సరం, అతని ఇంటి తోట వికసిస్తుంది.మాకు ఆహ్లాదకరమైన దృశ్యాన్ని అందిస్తుంది!.” అని పేర్కొన్నారు.

ఈ రైల్వే అధికారి మొత్తం మూడు ట్వీట్స్‌లో 12 ఫొటోలను షేర్ చేశారు.ప్రతీ ఫొటోలో కూడా అందమైన పూల మొక్కలు కనిపించాయి.ఈ అందమైన హోంగార్డెన్‌ను కవర్ చేయడానికి ఒక ఫొటో కాకుండా 12 ఫొటోలు తీయాల్సి వచ్చింది అంటే అది ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.అలాగే అది ఎంత అందమైనదో కూడా అర్థం చేసుకోవచ్చు.

చాలా మంది ట్విట్టర్ యూజర్లు సహోద్యోగి గార్డెనింగ్ వర్క్ చూసి ముగ్ధులయ్యారు.కొంతమంది వినియోగదారులు సహోద్యోగి ఇల్లు వ్యక్తిగతమా లేదా ప్రభుత్వ నివాసమా అని సందేహం వ్యక్తం చేశారు.మొత్తంమీద, అద్భుతమైన ఉద్యానవనం అందరి మనసులను దోచేస్తోంది.ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ అందమైన గార్డెన్ చూస్తే మనసుకు ఎంతో ప్రశాంతత దొరుకుతుంది.ఈ కొలీగ్ ఎవరో చాలా అదృష్టవంతులు అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube