ఏపీ సీఎం జగన్ పై సీపీఐ నేత రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.జగన్ ఉండగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదంటూ ధ్వజమెత్తారు.
తెలంగాణలో కేసీఆర్ కు పట్టిన గతే ఇక్కడ జగన్ కు పడుతుందని రామకృష్ణ జోస్యం చెప్పారు.ఏపీలో ఓ వైపు తుఫాన్, మరోవైపు కరవుతో ప్రజలు అల్లాడిపోతున్నారని తెలిపారు.
తుఫాన్ ప్రభావిత బాధితులను పరామర్శించేందుకు వెళ్లి షో చేస్తున్నారని విమర్శించారు.రైతుల కష్టాల్లో ఉన్నారన్న బాధ సీఎం జగన్ కు లేదని మండిపడ్డారు.460 మండలాల్లో తీవ్ర కరవుంటే 103 మండలాల్లోనే ఉందన్నారు.అలాగే ఈనెల 14న జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.