పంచాయతీ ఎన్నికల్లో పార్టీని నడిపించేది ఎవరు ? ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పార్టీతరఫున వాయిస్ వినిపించేది ఎవరు ? ఇదీ ఇప్పుడు వైసీపీలో అంతర్మథనంగా మారిన విషయం.పార్టీలో లెక్కకు మిక్కిలిగా నాయకులు ఉన్నారు.
గత ఎన్నికల్లో భారీ విజయం తర్వాత వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ నాయకగణం దూకుడుగా ముందుకు సాగుతుందని అందరూ అనుకున్నారు.కానీ, జిల్లాల్లో పరిస్థితి వేరేగా ఉంది మంత్రుల దూకుడు ఎక్కువగా ఉంది.
దీంతో నాయకులు సైలెంట్ అవుతున్నారు.
ఇప్పటి వరకు అన్నీ ఆయనే చూసుకున్నారు.
పంచాయతీ ఎన్నికలను కూడా ఆయనే నడిపించాలి! అని క్షేత్రస్థాయిలో నాయకులు కామెంట్లు చేస్తున్నారు.కానీ, వాస్తవానికి ఎంతగా మంత్రుల దూకుడు ఉన్నా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో మంత్రులకు పట్టులేదు.
నాయకులపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నా గ్రామీణ స్థాయిలో మంత్రులు దూసుకుపోలేని పరిస్థితి ఉంది.దీంతో ఎమ్మెల్యేలకు మంచి అవకాశం చిక్కినట్టయింది.
తమ సత్తా చూపించేందుక .తమ పరిధిలో ఎక్కువగా ఏకగ్రీవాలు చేసుకునేందుకు మంత్రులకు అవకాశం చిక్కినట్టయింది.అయితే మంత్రులు ఇప్పటి వరకు తమపై ఆధిపత్యం ప్రదర్శించడంతో కీలక సమయంలో కాడి పడేయాలని నిర్ణయించుకున్నారు.

ఆ జిల్లా ఈ జిల్లా.అనే తేడా లేకుండా.మంత్రులు ప్రతి జిల్లాలోనూ ఆధిపత్య ధోరణితోనే ముందుకు సాగారు.
ప్రతి విషయంలోనూ తమదే పైచేయి అన్నట్టుగా వ్యవహరించారు.ఇక.ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పొలిటికల్ గా పుంజుకోవాల్సిన అవసరం ఏర్పడింది.ఈ క్రమంలో స్థానిక నాయకత్వం దూకుడుగా వ్యవహరించాలని అనుకున్నా రేపు ఏకగ్రీవాలు వచ్చి మంచి గుర్తింపు లభిస్తే.
తమకు దక్కాల్సిన క్రెడిట్‌ను మంత్రులు తమ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది.అంటే కష్టం ఒకరిది.ఫలితం మరొకరిది అన్నట్టుగా పరిస్థితి మారే అవకాశం ఉంది.దీనిని గ్రహించిన నాయకులు ఎక్కడికక్కడ మౌనంగా ఉండడం గమనార్హం.
ఇది వైసీపీకి ఇబ్బందికర పరిణామంగా మారిందని అంటున్నారు పరిశీలకులు.