బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసుపై సుప్రీంకోర్టులో మధ్యాహ్నం విచారణ జరగనుంది.ఈ మేరకు లంచ్ తరువాత విచారణ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కోర్టు నంబర్ 2లో ఉన్న అన్ని కేసుల విచారణ పూర్తయిన తరువాత కవిత కేసును అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది.దర్యాప్తు సంస్థలు మహిళలను తమ కార్యాలయాలకు పిలిచి విచారించే అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
మహిళల ఈడీ దర్యాప్తుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు నళినీ చిదంబరం, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కవిత పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరగబోతుంది.







