దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే సమంత ప్రధాన పాత్రలో.
మహాభారతంలోని ఆది పర్వం నుంచి స్ఫూర్తిగా కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన శాకుంతలం అనే సినిమాలో నటించారు.గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో నటించారు.
పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉన్నటువంటి ఈ సినిమాలోమలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంత్ రాజుగా నటిస్తున్నాడు.కబీర్ సింగ్ దుహన్ కింగ్ అసుర పాత్ర పోషిస్తున్నాడు.ఇక సమంత శకుంతల పాత్రలో నటించడం కోసం తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా శకుంతల పాత్రలో నటించడం కోసం సమంత బాడీ లాంగ్వేజ్ ట్రైనింగ్ తీసుకున్నట్లు వెల్లడించారు.క్లాసికల్ మోడల్ గా కనిపించడం కోసం సమంత ఏకంగా మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించారు.

శాకుంతలం సినిమా పౌరాణిక సినిమా కావడంతో పురాణకాలం నాటి భంగిమలు, నడక, ఇతరత అంశాలలో నటించడం కోసం సమంత మూడు నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు వెల్లడించారు.ఇలా శాకుంతలం సినిమాలో శకుంతల పాత్రలో నటించడానికి సమంత తీవ్రస్థాయిలో కృషి చేసినట్లు వెల్లడించారు.ఇక ఈ సినిమాలో భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించిన సంగతి మనకు తెలిసిందే.







