సోషల్ మీడియాలో డాగ్స్ కి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి.ముఖ్యంగా ఇవి చేసే కొన్ని అల్లరి పనులు చాలా మందిని ఆకట్టుకుంటాయి.
తాజాగా అలాంటి వీడియో వైరల్ గా మారింది.దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక గోల్డెన్ రిట్రీవర్ కుక్కను చూడొచ్చు.ఇది ఒక కిచెన్ లో బల్లపై ఉన్న ఫుడ్ ఐటమ్స్ వైపు చూస్తూ ఉండటం గమనించవచ్చు.
దీనికి ఆ ఫుడ్ చూడగానే బాగా నోరూరింది ఏమో.అందుకే అది టేబుల్ పైకి ఎక్కి ఫుడ్ ఉన్న ఒక బాక్స్ ని నోట కరుచుకుంది.అనంతరం దానిని అక్కడి నుంచి తీసుకెళ్లి గప్ చిప్ గా తినాలనుకుంది.కానీ ఈ క్రమంలోనే యజమాని దీనిని చూసింది.“హేయ్, ఏం చేస్తున్నావు? ఆ బాక్స్ ని కింద పెట్టు” అని యజమాని అనడంతో కుక్క ఒక్కసారిగా ఉలిక్కిపడింది.“అయ్యో, రెడ్‌హ్యాండెడ్‌గా దొరికానే” అన్నట్లుగా అది గిల్టీగా ఫేస్ పెట్టింది.ఆ తర్వాత బాక్స్ ని కింద పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
దీనికి సంబంధించిన వీడియో Buitengebieden అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.
దీనికి ఇప్పటికే రెండు లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు “క్యూట్ దొంగ” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ కుక్కకి అది ఇష్టమైన ఫుడ్ అనుకుంటా, అందుకే దొంగతనం చేయడానికైనా సాహసించి ఉంది అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.







