వెంకటేష్ కెరీర్‌ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడా?

టాలీవుడ్‌ లో వెంకటేష్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది.ఆయన ప్రతి సినిమా కూడా చాలా స్పెషల్‌ గా ఉండాలని.

 After F3 Movie Venkatesh Take A Key Decision , F3 Movie, Flim News, Tollywood News, Venkatesh, Varun Tej,-TeluguStop.com

కొత్తదనం తో ఉండాలని ఆరాటపడుతాడు.అద్బుతమైన సినిమాలను ఎన్నో ఇచ్చిన వెంకటేష్ ఆరు పదుల వయసు లో పడ్డ నేపథ్యంలో సినిమా ల ఎంపిక విషయంలో మార్పు చేర్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో మాదిరిగా ప్రేమ కథలను ఎంపిక చేసుకోకుండా వయసుకు తగ్గట్లుగా పాత్రలను ఎంపిక చేసుకుంటాడట.అందులో భాగంగానే ఈమద్య కాలంలో వరుసగా వయసుకు తగ్గట్లుగా పాత్రలు చేస్తున్నాడు.

ఎఫ్ 3 లో మళ్లీ ప్రేమ.పెళ్లి కాని కుర్రాడి పాత్రలో కనిపించబోతున్నాడు.

కాని ఎఫ్ 3 సినిమా తర్వాత ఖచ్చితంగా ఒక కీలక నిర్ణయం ను ఆయన తీసుకుంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి.అందులో భాగంగానే ఇక మీదట వయసుకు తగ్గ పాత్రలను పూర్తి గా చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Tollywood, Venkatesh-Movie

అమితాబచ్చన్ తో పాటు బాలీవుడ్‌ లో కొందరు సీనియర్‌ నటులు ఎలా అయితే పాత్రకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలు చేయాలని భావిస్తారో అదే చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.ఆ విషయాన్ని తన దర్శకులతో కూడా వెంకటేష్ చెబుతున్నాడట.ఇదే సమయంలో ఇతర హీరోలతో కలిసి కూడా స్క్రీన్‌ షేర్ చేసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఎప్‌ 3 వంటి మల్టీ స్టారర్‌ సినిమా లను ఆయన ఎప్పుడు చేయాలని సిద్దం గా ఉంటాడు.

మహేష్ బాబు తో కలిసి నటించిన వెంకటేష్ ఇప్పుడు వరుణ్ తేజ్ తో చేస్తున్నాడు.ఆ తర్వాత సల్మాన్‌ ఖాన్‌ తో చేస్తున్నాడు.

ముందు ముందు మరిన్ని మల్టీ స్టారర్ లు చేస్తాడని అభిమానులు ఆశ పడుతున్నారు.అంటే వెంకటేష్ ఒక కమర్షియల్‌ హీరోగా మనకు కనిపించే అవకాశం లేదన్నమాట అంటూ మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube