క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఛాన్స్ ఉన్న ఓడిన ఆఫ్ఘనిస్తాన్..!

ఆసియా కప్ లో( Asia Cup ) భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పై శ్రీలంక రెండు పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్-4 కు అర్హత సాధించింది.చివరి వరకు పోరాడిన ఆఫ్ఘనిస్తాన్( Afghanistan ) ఓటమిని ఖాతాలో వేసుకుని సూపర్-4 కు అర్హత సాధించలేకపోయింది.ఆఫ్ఘనిస్తాన్ సూపర్-4 కు అర్హత సాధించాలంటే 37.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించాల్సి ఉండేది.అయితే చివరి వరకు పోరాడి విజయానికి మూడు పరుగుల దూరంలో ఆఫ్ఘనిస్తాన్ ఆగిపోయింది.మూడు పరుగులు చేసి ఉంటే మ్యాచ్ గెలవడంతో పాటు సూపర్-4 కు అర్హత సాధించేది.అయితే 37.1 ఓవర్లు అయిపోయిన తర్వాత కూడా ఆఫ్ఘనిస్తాన్ కు సూపర్-4 కి అర్హత సాధించే అవకాశం ఉంది అనే విషయం తెలియక శ్రీలంకకు విజయాన్ని అప్పగించారు.

 Afghanistan Heart Breaking Loss Against Sri Lanka In Asia Cup 2023 Details, Afgh-TeluguStop.com

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు( Srilanka ) 292 పరుగుల భారీ లక్ష్యం ఆఫ్ఘనిస్తాన్ ముందు ఉంచింది.ఈ లక్ష్యాన్ని 37.1 ఓవర్లలో ఛేజ్ చేస్తేనే ఆఫ్ఘనిస్తాన్ సూపర్-4 కు అర్హత సాధిస్తుంది.అయితే 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆఫ్గనిస్తాన్ జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు నబీ( Nabi ) 32 బంతుల్లో 67 పరుగులు చేసి శ్రీలంకకు చెమటలు పట్టించాడు.

నబీతో పాటు కెప్టెన్ షాహిద్( Shahid ) అర్థ సెంచరీతో రాణించాడు.

Telugu Afghanistan, Asia Cup, Gurbaz, Mohammad Nabi, Muzeeb, Rashid Khan, Shahid

ఆఫ్ఘనిస్తాన్ మిగతా బ్యాటర్లైన కరీం జనత్, నాజీబుల్లా జద్రాన్ కూడా వేగంగా పరుగులు అందించారు.కచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ సంచలనం విజయం సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు.ఆఫ్ఘనిస్తాన్ 37 ఓవర్లకు 8 వికెట్లను కోల్పోయి 289 పరుగులు చేసింది.

మరో మూడు పరుగులు చేస్తే మ్యాచ్లో విజయం సాధించడంతో పాటు సూపర్-4 కు( Super-4 ) అర్హత సాధించగలుగుతుంది.అయితే 38వ ఓవర్ తొలి బంతికి ముజీబ్( Muzeeb ) భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి అవుట్ అవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆశలు ఆవిరయ్యాయి.

Telugu Afghanistan, Asia Cup, Gurbaz, Mohammad Nabi, Muzeeb, Rashid Khan, Shahid

ఇక ఆఫ్గనిస్తాన్ కు మరొక ఛాన్స్ మిగిలి ఉందని గ్రౌండ్లో ఉండే ప్లేయర్లకు బహుశా తెలియకపోయి ఉండవచ్చు.ఆఫ్ఘనిస్తాన్ 37.5 ఓవర్లలో 295 పరుగులు చేసి ఉంటే.కచ్చితంగా సూపర్-4 కు అర్హత సాధించేది.

చివర్లో వచ్చిన ఫరూకీకి ఈ విషయం తెలియక డిఫెన్స్ ఆడి మూడో బంతికి అవుట్ అయ్యాడు.ఆలా కాకుండా ఫరూకీ ఒక సింగల్ తీసి, అనంతరం రషీద్ ఖాన్( Rashid Khan ) ఒక సిక్స్ కొట్టి ఉంటే ఆఫ్ఘనిస్తాన్ సూపర్-4 కు అర్హత సాధించేది.

క్రికెట్ చరిత్రలో గెలిచే మ్యాచ్ చేజేతుల ఓడిపోవడం ఇదే మొదటిసారి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube